ఉరిశిక్ష తీర్పు ఇచ్చాక…ఆ తీర్పు ఇచ్చిన జడ్జ్ లు… ఆ ముద్దాయి కేసుకు సంబంధించిన పేపర్స్ పై సంతకం చేసి…ఆ పెన్ మొన( Nib) ను విరగొడతారు.! ఇది కొత్తగా వచ్చిందేం కాదు…బ్రిటీషర్స్ మనల్ని పరిపాలిస్తున్న కాలం నాటి నుండి ఈ ఆచారమే కంటిన్యూ అవుతూ ఉంది.! అసలు జడ్జ్ లు ఇలా ఎందుకు చేస్తారు? దీని వెనుక గల కారణంలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.! దీని వెనుక పెద్ద సైంటిఫిక్ కారణాలు లేనప్పటికీ, మానవీయ కారణాలున్నాయి. మరణశిక్షతో ఓ వ్యక్తి జీవితానికి పుల్ స్టాప్ పడ్డట్టే…కాబట్టి దానికి కారణం జడ్జ్ చివరి సంతకం..సో ఆ సంతకాన్ని చేసిన పెన్ ను మళ్లీ వాడడం , ఆ పెన్ ను చూసిన ప్రతిసారీ ఓ వ్యక్తి ప్రాణాలను తీశాను కదా.! అనే గిల్టీ ఫీలింగ్ రాకుండా ఉండేందుకు ఆ పెన్ ను మరలా వాడకూడదనే ఉద్దేశ్యంతో పెన్ నిబ్ ను విరగొడతారు.!
ఉరిశిక్ష కు సంబంధించిన తీర్పు ఓ సారి చదివాక మళ్లీ దాన్ని సవరించే అధికారం సదరు న్యాయమూర్తికి కూడా ఉండదు. అందుకే రెండవ ఆలోచన కూడా రాకూడదనే ఉద్దేశ్యంతో ఇలా పెన్ నిబ్ ను తుంచేస్తారు.! ఉరిశిక్ష తీర్పు అనంతరం…న్యాయమూర్తి కూడా ఆందోళనకు లోనవుతాడు.! ఈ క్రమంలో ఈ చిన్న పని( పెన్ నిబ్ ను విరగొట్టడం) ద్వారా తనను తాను కంట్రోల్ చేసుకునే అవకాశముంటుంది( సైకలాజికల్ గా – మైండ్ డైవర్షన్).
ఒక మనిషిని చంపే అధికారం ఎవ్వరికీ లేదు, కానీ తన విధుల ప్రకారం న్యాయమూర్తి ఈ పనిని చేయాల్సి వస్తుంది. అంటే ఒకరి చావుకు కారణం తన సంతకం, దానికి కారణం ఆ పెన్…సో అతని చావుకు చిన్న పశ్చాతపం సంతకానికి ఉపయోగించిన పెన్ ను కూడా చంపడమే( విరగొట్టడమే).!