Off Beat

“మైసూర్” ని కాదని “బెంగళూర్” నే కర్ణాటక రాజధానిగా ఎందుకు చేసారు ?

బెంగళూరుతో పోలిస్తే మైసూరుకు చాలా చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ బెంగళూరునే రాజధానిగా ఎంచుకోవడానికి ప్రముఖ కారణం బ్రిటిషర్లు. ఈ విషయమై కొంత లోతుగా ఆలోచిస్తే… మైసూరు రాజ్యాన్ని 14వ శతాబ్దం నుంచి వడియార్లు పరిపాలించారు.

భారత దేశాన్ని బ్రిటిషర్లు పాలిస్తున్న ఆ రోజుల్లో వారితో సంధి చేసుకుని వారికి అనుగుణంగానే వీరు పాలన సాగించేవారు. బెంగుళూరు మైసూరులో అంతర్భాగంగానే ఉండేది. దానిపై బ్రిటిష్ వారి ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. వారు బెంగళూరును అభివృద్ధి వైపు నడిపించారు. వారి అవసరాల కోసమే బెంగళూరును డెవలప్ చేశారు. బెంగళూరు వాతావరణం కూడా వారికి అనుకూలంగా ఉండటం మరొక కారణం.

why karnataka chose bengaluru as capital over mysuru

మైసూరులో మొదటగా విద్యుత్ వచ్చిన ప్రాంతం కూడా బెంగళూరు. టెలిఫోన్ మరియు టెలిగ్రామ్ వంటి సౌకర్యాలు అలానే బ్రిటిష్ నుంచి వచ్చే వ్యాపారస్తుల కోసం రైల్వే లైన్స్… థియేటర్లు, ఆసుపత్రులు, యూనివర్సిటీలు చివరకు బ్రిటీష్ కాలనీలు కూడా వెలిశాయి. బెంగళూరు చాలా అభివృద్ధి చెందింది. స్వతంత్రం వచ్చాక పూర్తిగా అభివృద్ధి చెందిన బెంగుళూరుని రాజధానిగా ఎంచుకున్నారు.

Admin

Recent Posts