Off Beat

కడియం వద్ద రైల్వేలైన్ బాగా వంగి ఉంటుంది ఎందుకు?

మనం సామర్లకోట నుండి రాజమండ్రి ట్రైన్ లో వెడుతున్నప్పుడు కడియం స్టేషను తర్వాత రైల్వే ట్రాకు కుడి వైపుకి మలుపు తిరుగుతుంది. మనం రోడ్డు మీద సైకిలు మీద వెడుతుంటే మలుపు వచ్చినప్పుడు కొంత సైకిలు తో సహా వొంగినట్లు గమనిస్తాము. కుడి వైపు మలుపు అయితే కుడి వైపుకు, యెడమ వైపు మలుపు అయితే యెడమ వైపుకు వొంగిన అనుభవం వుంటుంది. అందుకనే రోడ్డు వేసేటప్పుడు కూడా మలుపులలో కొంత స్లోప్ ఉండేట్లు వేస్తారు. మనం ఒక చిన్న రాయికి ఒక తాడు కట్టి గిర గిర తిప్పి వదిలేస్తే ఆ రాయి మన నుండి దూరంగా వెళ్ళిపోతుంది. అంటే ఏదైనా వృత్తాకారం లో తిరుగుతున్న వస్తువుకి ఆ వృత్త కేంద్రం నుండి దూరంగా ప్రయాణించే శక్తి వుంటుంది. అందుకే రాయికి కట్టిన తాడు రాయిని తిప్పేటప్పుడు టెన్షన్ లో వుంటుంది. ఎప్పుడైతే తాడు వదిలేస్తామో అప్పుడు ఆ రాయి మన నుండి దూరంగా వెళ్లి పడుతుంది. ఈ శక్తిని ఇంగ్లీషులో centrifugal force అంటారు.

ఇప్పుడు ట్రైన్ విషయానికి వస్తే, ట్రైన్ మలుపులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక circular path లో వుంటుంది. మరి circular motion లో వున్నప్పుడు మనం రాయిని గిర గిర తిప్పినప్పుడు ఎలాగైతే మన నుండి దూరంగా వెళ్ళడం జరుగుతుందో ట్రైన్ కూడా అటువంటి lateral forces కి గురి అవుతుంది. ఇలాటి సందర్భంలో ట్రాకులో రెండు రైలు పట్టాలు ఒకే లెవల్ లో ఉన్నట్లయితే , ట్రైన్ మలుపు తిరిగేటప్పుడు ఒక వైపు రైలు చక్రం పట్టా దాటి బయటకు పడిపోయే ప్రమాదముంటుంది.

why railway track is bent near kadiyam railway station

అందుకోసం కుడిచేతి మలుపులో యెడమ చేతి వైపు రైలు పట్టాని , కుడి చేతి వైపు రైలు పట్టా కంటే కొంచెం ఎత్తులో ఉంచుతారు. అలాగే యెడమ చేతి మలుపు అయితే కుడి చేతి వైపు రైలు పట్టానీ కొంత ఎత్తులో వుంచుతారు. రెండు పట్టాల లెవల్ లో ఉన్న వత్యాసాన్ని రైల్వే పరిభాషలో super elevation అంటారు. రైలు మార్గము నిర్మించేటప్పుడు degree of curve, length of curve, permitted maximum speed దృష్టిలో ఉంచుకుని ఎంత super elevation ఉండాలి design చేస్తారు. ఈ విధమైన అమరిక కడియం ఒక్క చోటనే కాదు. రైలు మార్గం curve (వొంపు) ఉన్న అన్ని చోట్ల తప్పనిసరిగా వుంటుంది. Curve narrow అయిన కొద్ది ఈ super elevation ఎక్కువుగా వుంటుంది.

Admin

Recent Posts