చాలా వరకు పాత ప్రభుత్వ భవనాల ప్రధాన గేట్ వద్ద కింద ఒక కాలువలా త్రవ్వి దాని మీద ఇనుప పైపులు ఒకదానిమీద ఒకటి వేసి ఏదైనా వాహనం కానీ మనుషులు దానిద్వారా నడిచినపుడు శబ్దం చేస్తూ ఉండేలా ఏర్పాటు ఉంటుంది, దీని ఉపయోగం ఏమిటి అంటే..? ఇవి కుక్కలు, పందులు ప్రాంగణంలోకి రాకుండా అడ్డుకోవడానికి, అదే సమయంలో మనుషులు రావడానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇవి పెడతారు.
కుక్కలు, పందులు వంటి జంతువుల గిట్టలు మనుషుల పాదాలతో పోలిస్తే చిన్నగా ఉంటాయిగా. అందువల్ల వాటి కాళ్ళు ఆ సందులో ఇరుక్కుపోయేందుకు, తద్వారా అవి స్వేచ్ఛగా రాకుండేందుకు వీటివల్ల వీలవుతుంది.
వీటిని కేటిల్ గ్రిడ్ (cattle grid), కౌ కేచర్, క్యాటిల్ ట్రాప్ అంటారు. దాని ప్రకారం – పశువులు (ఆవులు, గేదెలు, మేకలు, వగైరా) లోపలికి వచ్చి పూలమొక్కలు, గడ్డి తినేయకుండా అడ్డుకుంటాయట. స్థూలంగా చూస్తే గిట్టలు ఉన్న జంతువులు అన్నిటినీ లోపలికి రాకుండా నిరోధించడం వీటి పని.