Off Beat

పాము కుబుసం ఎందుకు విడుస్తుంది? ఆ స‌మ‌యంలో పాముల‌ను చూస్తే అవి ప‌గ‌బ‌డ‌తాయా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కుబుసం విడవటం కోసం పాము తన తలను గరుకు ప్రదేశంలో రుద్దుకుంటుందని ప్రొఫెసర్ మంజులత చెప్పారు&period; పొదలు&comma; చిన్నచిన్న రంధ్రాలు&comma; రాళ్ల మధ్య&comma; ఇంటి గోడలకు ఉండే కన్నాల వద్ద పాము కుబుసాలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి&period; కుబుసాన్ని పట్టుకుంటే విషం అంటుకుంటుందనే వాదనలు వింటుంటాం&period; ఇంకొందరు కుబుసం విడిచే సమయంలో చూస్తే పాములు పగబడతాయంటారు&period; ఇందులో నిజమెంత&quest; ప్రపంచంలో ఉన్న అన్ని రకాల పాములు కుబుసం విడుస్తాయా&quest; ఎన్ని రోజులకు ఒకసారి పాము కుబుసం విడుస్తుంది&quest; పాము కుబుసం విడవటం మర్చిపోతుందా&quest; అలా జరిగితే అర్థం ఏంటి&quest; అసలు పాము కుబుసం ఎందుకు విడుస్తుందో తెలుసా&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటికి సమాధానాలు తెలుసుకునేందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం జువాలజీ విభాగం ప్రొఫెసర్ సి&period; మంజులత&comma; అలాగే ఈస్ట్రన్ ఘాట్ వైల్డ్ లైఫ్ సొసైటీ కన్జర్వేషన్ బయోలజిస్ట్‌గా పని చేస్తున్న మూర్తి కంఠిమహంతిల మాట్లాడింది&period; కుబుసం&lpar;పాము శరీరంపై పొర&rpar; విడవడమనేది పాముల్లో జరిగే అత్యంత సహజమైన ప్రక్రియ అని ప్రొఫెసర్ సి&period; మంజులత చెప్పారు&period; దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఆమె వివరించారు&period; ఇది మనుషుల్లో కూడా జరుగుతుంది&period; అయితే మనం రోజూ స్నానం చేస్తుండటంతో అది మనం గుర్తించలేం&period; కానీ పాములకు పాత పొర కింద కొత్త పొర ఏర్పడిన తర్వాత పాత పొరని వదిలేసే ప్రక్రియే కుబుసం విడవటం&period; పాములు తమ కుబుసాన్ని ఏకమొత్తంగా ఒకేసారి విడుస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80045 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;snake&period;jpg" alt&equals;"why snakes shed skin " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన శరీరం సైజు పెరిగితే పాత బట్టలను ఎలాగైతే వదిలేసి మనకు తగ్గ సైజు బట్టలు కుట్టించుకుంటామో&&num;8230&semi; అలాగే పాములు కూడా తమ చర్మంపై పొర బిగుతుగా మారిపోయి దాని కింద కొత్త పొర ఏర్పడినప్పుడు పాత పొరని వదిలేస్తాయి&period; కుబుసం విడవటం కోసం పాము తన తలను గరుకు ప్రదేశంలో రుద్దుకుంటుంది&period; అప్పుడు అక్కడ పొరపై ఒక చీలిక ఏర్పడుతుంది&period; దాని నుంచి పాత పొరను వదిలించుకుంటూ పాము బయటకు వచ్చేస్తుంది&period; దీన్నే కుబుసం విడవడం అంటారు&period; ప్రపంచంలో ప్రస్తుతం 3 వేలకు పైగా ఉన్న పాము జాతులు కుబుసాన్ని విడుస్తాయని ప్రొఫెసర్ మంజులత చెప్పారు&period; పాము జీవించి ఉన్నంత వరకూ దాని శరీరం కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది&period; పాము శరీరం పెరుగుతూ ఉంటే&&num;8230&semi; సహజంగానే దాని చర్మం సాగుతూ బిగుతుగా అవుతుంది&period; ఇది మనుషుల్లో కూడా జరుగుతుంది&period; అలా బిగుతుగా మారిన చర్మం లేదా పైపొరనే పాము వదిలించుకుంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాము కుబుసాన్ని ఏక మొత్తంగా విడిచిపెట్టడంతో ఇది పాములాగే కనిపిస్తుంది&period; ప్రపంచంలో ప్రస్తుతం 3 వేలకు పైగా ఉన్న పాము జాతులు కుబుసాన్ని విడుస్తాయని&comma; కుబుసం విడవని పాములు ఉండవని మంజులత చెప్పారు&period; కుబుసం విడవడమంటే సూక్ష్మజీవులు&comma; మలినాలతో బిగుతుగా మారిన చర్మంపై పొరని వదిలించుకోవడమే&period; పాములు ఒక నిర్ధిష్ట కాలానికి ఒకేసారి ఏక మొత్తంగా కుబుసాన్ని విడుస్తాయి&period; పాత చర్మంపై ఉన్న సూక్ష్మజీవుల నుంచి కాపాడుకోడానికి పాములకు కుబుసం విడిచే ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుందని ప్రొఫెసర్ చెప్పారు&period; కుబుసం విడుస్తుందంటే ఆ పాము పై పొర కింద కొత్త పొర ఏర్పడినట్లే అర్థం అని మూర్తి కంఠిమహంతి చెప్పారు&period; పాము కుబుసం వదిలే సమయంలో దాని పరిస్థితిని మూర్తి వివరిస్తూ&period;&period; తన చర్మంపై కొత్త పొర ఏర్పడిందనే విషయం పాముకి ఎప్పుడైతే అర్థం అవుతుందో&&num;8230&semi; అది వెంటనే పాత పొరని వదిలించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెడుతుంది&period; అప్పటికే దాని కళ్లు సరిగా కనిపించవు&period; ఎందుకంటే దాని కళ్లపై కూడా పొర ఏర్పడటమే కారణం&period; పైగా కళ్లు నీలంగా మారిపోతాయి&period; అటువంటి సమయంలో పాములు వెంటనే కుబుసం వదలడానికి సిద్ధమవుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-80044" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;snake-skin&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుబుసం వదిలే సమయంలో పాము కష్టంలో ఉన్నట్లే అర్థం&period; కుబుసం విడిచిపెట్టిన తర్వాత ఒక్కసారిగా రిలాక్స్ అయిపోతుంది&period; దాంతో చాలా యాక్టివ్‌గా ఉంటుంది&period; ప్రెష్‌గా కనిపిస్తుంది&period; ఎందుకంటే పాము కుబుసం విడిచిపెట్టే సమయంలో అసౌకర్యంగా ఉండి ఎటువంటి ఆహారం తీసుకోదు&period; దాంతో ఆకలి తీర్చుకునేందుకు చాలా ఉత్సాహంతో తిరుగుతూ ఉంటుంది అని చెప్పారు&period; కుబుసం విడిచే సమయంలో ఆ సమీపంలో అలికిడి వినిపిస్తే పాము దాడి చేసేందుకు ప్రయత్నిస్తుందని మూర్తి కంఠిమహంతి చెప్పారు&period; కుబుసం విడిచిపెట్టే సమయంలో పాముని చూస్తే అది పగపట్టి&comma; కాటేస్తుందనే కొందరి నమ్మకాలపై మూర్తి స్పష్టతనిచ్చారు&period; శరీరంపై కుబుసం ఉన్నపుడు పాము అసౌకర్యంగా ఉంటుంది&period; దీంతో ఎవరు దాడి చేయకుండా చీకటిగా ఉన్న చోటే ఉంటుంది&period; ఆ సమయంలో దానికి ఇబ్బంది కలిగించేలా అలికిడి చేసినా&comma; దానిని కదిపినా అది చాలా అసౌకర్యానికి గురై&comma; దాడి చేస్తుంది&period; పైగా కుబుసం విడిచిపెట్టే సమయంలో కంటి వద్ద కుబుసం సరిగా విడవకపోతే అది మరింత ఇబ్బంది&period; దాంతో కుబుసం విడిచే సమయంలో ఆ సమీపంలో అలికిడి వినిపిస్తే దాడి చేసేందుకు సహజంగానే ప్రయత్నిస్తాయి&period; దీనినే అందరు పగ పట్టాయి అంటుంటారు అని మూర్తి కంఠిమహంతి చెప్పారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రపంచంలో అన్ని పాము జాతులు కుబుసం విడుస్తాయి&period; రెండు&comma; మూడు వారాల వయసున్న పాములు&comma; ఇంకా పిల్లలుగానే ఉన్నవి నెలలో మూడు నాలుగు సార్లు కుబుసం విడుస్తాయని మూర్తి కంఠిమహంతి తెలిపారు&period; ఇక వయసు ఎక్కువైన పాములు ఏడాదికి ఒకటి&comma; రెండు సార్లు కుబుసం విడుస్తాయన్నారు&period; పాములు కుబుసం ఎంత తరుచుగా విడుస్తాయనే దానికి నిర్ధిష్టమైన లెక్క ఉండదు&period; పాము తీసుకున్న ఆహారం&comma; అది ఉన్న ప్రదేశం&comma; అక్కడ ఉష్ణోగ్రత&comma; తేమశాతంపై కూడా అది ఆధారపడి ఉంటుంది&period; అలాగే పాము జాతి కూడా ప్రధాన అంశమే అని మూర్తి కంఠిమహంతి చెప్పారు&period; కంటి పై పొర నుంచి తోక చివరి భాగం వరకు మొత్తం పొరని ఏక కాలంలో విడిచే ఏకైన జీవజాతి పాములేనని చెప్పారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-80043" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;snake-skin-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాముకి పై పొర ఎప్పుడైతే అసౌకర్యంగా మారుతుందో&period;&period; దానిని పాము భరించలేని పరిస్థితి వస్తుంది&period; ఒక సెన్సార్స్ వంటి వ్యవస్థ ఆ పొరని వదిలించుకోమని పాముకి సిగ్నల్స్ ఇస్తుంది&period; దాంతో పాము తన పై పొరని వదిలించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది&period; ఈ కుబుసం విడవడమనేది సహజ ప్రక్రియ&period; అది అవ్వకపోతే పాము అనారోగ్యం పాలైనట్లే భావించాలి&period; అప్పుడు అది యాక్లివ్‌గా ఉండదు&period; చర్మ వ్యాధులకు కూడా లోనవుతుంది&period; ఆహారం సరిగా తీసుకోలేదు&period; అలా ఒక సమస్య తర్వాత మరొకటి చేరి ఒకటి చేరి పాము మరణానికి కూడా దారి తీస్తుందన్నారు&period; ఆ సమయంలో మనం దానికి ఏదైనా సహాయం చేద్దామన్నా&period;&period; అవి పూర్తి అసౌకర్యంగా ఉండి&comma; వాటి దగ్గరకు వెళ్లిన వారిపై దాడి చేసే అవకాశం ఉందని మూర్తి కంఠిమహంతి చెప్పారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాము కుబుసం విడవకపోతే అనారోగ్యం పాలైనట్లే భావించాలని మూర్తి చెప్పారు&period; పాము విడిచిన కుబుసం విషంతో సమానమనే ప్రచారం కూడా ఉంది&period; దీనిపై ప్రొఫెసర్ మంజులత స్పష్టతనిచ్చారు&period; కుబుసాన్ని తాకితే ఏమీ కాదు&period; కుబుసం అనేది ప్రాణం లేని కణ జాలం&period; దానిపై పాము విషం ఉండదు&period; కాబట్టి కుబుసంపై అపోహాలు వద్దు అని మంజులత చెప్పారు&period; అయితే కుబుసం వదిలిన ప్రాంతానికి సమీపంలో పాము ఉండే ప్రమాదం ఉంటుందని&comma; జాగ్రత్తగా ఉండాలని సూచించారు&period; కుబుసం వదిలిన చోటు దానికి ఆవాసం లాంటిది&period; అందుకే కుబుసం విడిచిన తర్వాత కూడా అది అక్కడే ఉండొచ్చు&period; మనకు కుబుసం కనిపిస్తే&period;&period; అక్కడ పొగ పెట్టడం ద్వారా పాముని మరొక చోటుకు పంపేయవచ్చు అని ప్రొఫెసర్ మంజులత చెప్పారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts