Off Beat

మన కోహినూర్ వజ్రాన్ని తిరిగి దేశానికి ఎందుకు తీసుకురాలేకపోతున్నామో తెలుసా?

చరిత్రలో కొన్ని అమూల్యమైన వస్తువుల స్థానం ఎప్పటికీ పదిలంగా ఉంటుంది. భారతదేశానికి సంబంధించినంతవరకు అటువంటి గొప్ప విలువైన వస్తువు ఏదైనా ఉంది అంటే అది కోహినూర్ వజ్రమే. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న కోహినూర్ డైమండ్ జన్మస్థలం భారతదేశం అయినప్పటికీ ఇక్కడి రాజుల అంతర్గత కలహాల వల్ల ఆ వజ్రం దేశాలు దాటిపోయింది. అలా చివరికి ఈ వజ్రం బ్రిటన్ రాణి కిరీటంలో పొదుగుతోంది. ప్రస్తుతం ఈ వజ్రానికి విలువ కట్టడం ప్రపంచంలో ఎవరి తరం కాదు. కోహినూర్ వజ్రం మొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం కొల్లూరు గనుల్లో లభించినట్లు పురావస్తు శాఖ వారు చెబుతున్నారు.

ఈ వజ్రం 105 క్యారెట్లు కలిగి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రమని చెబుతుంటారు. ఈ వజ్రాన్ని 1877వ సంవత్సరంలో హిందూ దేశ మహారాణిగా విక్టోరియా మహారాణి పట్టాభిశక్తురాలు అయినప్పుడు ఆమె కిరీటంలో పొందుపరిచారట. అయితే అప్పటిలో ఈ వజ్రంను మగవాళ్లు ధరిస్తే సర్వనాశనం అయిపోతారని, అలాగే స్త్రీలు ధరిస్తే బాగా అభివృద్ధి చెందుతారని అనే వారట. అందుకే ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ బ్రిటన్ రాణి మాత్రం ఈ వజ్రాన్ని వదిలిపెట్టడం లేదట. అయితే కోహినూర్ అనే పదానికి కోహు-ఈ-నూర్ ఈ నూరు అంటే ‘కాంతి శిఖరం’ అని అర్థమట. ఈ వజ్రానికి ఈ పేరు ఒక ముసలమన్ రాజు పెట్టారట.

why we are not bringing back kohinoor diamond

ఈ వజ్రాన్ని మొదటిగా దక్కించుకున్న వ్యక్తి మాల్వా రాజు మహాలక్ దేవ్. కాలాంతరంలో చివరికి ఈ వజ్రంను బ్రిటిష్ గవర్నర్ లార్డ్ డల్హౌసీ దీన్ని విక్టోరియా రాణి కి బహుమతిగా ఇప్పించాడట. అయితే ఈ వజ్రం తమకు తిరిగి ఇచ్చేయాలని మన దేశం ఇప్పటికే ఎన్నోసార్లు బ్రిటన్ ను అభ్యర్థించింది. కానీ బ్రిటన్ నుంచి ఎప్పుడు సానుకూల స్పందన రాలేదు. కోహినూరు వెనక ఇంత కథ ఉంది కాబట్టే మన దేశానికి అది తిరిగి రాలేకపోతోంది. ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ కన్నుమూసిన నేపథ్యంలో మరోసారి కోహినూర్ వజ్రం తిరిగి తీసుకొచ్చే విషయం మీద చర్చలు జరుగుతున్నాయి.

Admin

Recent Posts