శృంగారం అనేది ఒక పవిత్ర కార్యం. రెండు మనస్సులు కలిసే సమయం, రెండు శరీరాలు ఏకమై జీవితాంతం తోడుగా ఉంటామంటూ ప్రమాణాలు చేసుకునే సమయం. ఆ సమయం కోసం ప్రతి పురుషుడే కాదు, స్త్రీ కూడా ఎదురు చూస్తుంది. కానీ నా జీవితంలో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. నా కథ చెబుతా వినండి. నేను కాస్త లావుగా ఉంటాను. అందుకని నాకు పెళ్లి చేయడం మా నాన్నకు చాలా కష్టంగా మారింది. ఆయన నా కోసం తరచూ సంబంధాలను చూసేవారు. నాకు 28 ఏళ్లు ఉన్నప్పటి నుంచి సంబంధాలను చూడడం మొదలు పెట్టారు. అయినా అందరూ నేను లావుగా ఉన్నానని తిరస్కరించేవారు. అలా 4 ఏళ్లు గడిచిపోయాయి. 32 ఏళ్లు వచ్చేశాయి.
ఓవైపు పెళ్లి కావడం లేదని నాన్న చాలా టెన్షన్ పడుతున్నారు. నా శరీరం కారణంగా నాకు పెళ్లి జరగడం లేదని నాకు అర్థమైంది. ఈ వయస్సు పెళ్లి అయితే పిల్లలకు కూడా సమస్య అవుతుందని ఎవరో చెబితే విన్నాను. దీంతో నాకు కూడా టెన్షన్ మొదలైంది. అదుగో అప్పుడే కలిశాడు విశాల్. సరిగ్గా నా ఆలోచనలకు ప్రతిరూపంగా వచ్చాడా అన్నట్లుగా.. మా ఇద్దరి టేస్టులు కలిశాయి. నెమ్మదిగా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. అలా కొంతకాలం గడిచింది. తరువాత ఇద్దరి ఇళ్లలో చెప్పి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. నాకు ఎట్టకేలకు పెళ్లవడంతో మావాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. కానీ సమస్య తరువాతే మొదలైంది.
పెళ్లి తరువాత ప్రతి పురుషుడు, స్త్రీ ఎదురు చూసే మధురమైన ఘట్టం.. తొలిరాత్రి. కానీ నాకు మాత్రం చేదు జ్ఞాపకాన్నే మిగిల్చింది. ఆ రోజు ఇంకా నాకు గుర్తుంది. గదిలో అలంకరణ చేశారు. విశాల్ బెడ్ మీద కూర్చుని ఉన్నాడు. నేను పాలు పట్టుకుని వచ్చి తన పక్కనే కూర్చున్నా. తరువాత కాసేపు ముచ్చటించుకున్నాం. ఇంతలో నాలో టెన్షన్ మొదలైంది. లేచి చూస్తే తెల్లారింది. రాత్రి ఏం జరిగిందో నాకు తెలియదు. అదే విషయాన్ని విశాల్‌ను అడిగా. నువ్వు విపరీతమైన భయంతో స్పృహ తప్పి పడిపోయావు. ఏమీ కాలేదు.. అన్నాడు. అంటే తొలిరాత్రి జరగలేదని తెలిసి సిగ్గు పడ్డా. విశాల్‌కు క్షమాపణ చెప్పా. ఫర్లేదులే అన్నాడు. తరువాత ఎప్పుడూ అలా జరగలేదు. ఆరోజు ఎందుకు అలా జరిగిందో ఇప్పటికీ తెలియదు. కానీ నన్ను అర్థం చేసుకుని నాతో ఉన్నందుకు విశాల్‌కు రోజూ థ్యాంక్స్ చెబుతూనే ఉన్నా.