Atti Patti Plant : అత్తిపత్తి మొక్క.. ఇది మనందరికీ తెలుసు. చేత్తో తాకగానే ఈ మొక్క ఆకులు ముడుచుకుపోతాయి. గ్రామాలలో, చేల దగ్గర, పొలాల దగ్గర ఈ మొక్క ఎక్కువగా కనడుబతుంది. దీనిని ఆంగ్లంలో టచ్ మీ నాట్ ప్లాంట్ అని అంటారు. ఈ మొక్క చూడడానికి చిన్నగా, పొదలాగా ఉంటుంది. అత్తిపత్తి మొక్క ఆకులు తుమ్మ చెట్టు ఆకుల లాగా ఉంటాయి. అత్తిపత్తి మొక్క ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ మొక్కను కూడా ఔషధంగా వ్యాధులను నయం చేయడంలో ఉపయోగిస్తారు.
ఈ మొక్క ఆకులు ముడుచుకోగానే మొక్క ఎండిపోయినట్టుగా కనబడుతుంది. కనుక పశువులు దీనిని తినకుండా ఉంటాయి. ఈ విధంగా అత్తిపత్తి మొక్క తనని తాను రక్షించుకుంటుంది. అత్తిపత్తి మొక్క వల్ల కలిగే ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ వ్యాధితో బాధపడే వారు అత్తిపత్తి మొక్క మొత్తాన్ని సేకరించి శుభ్రంగా కడిగి ఎండలో ఎండబెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని రోజూ 2 గ్రాముల మోతాదులో సేవిస్తూ ఉంటే షుగర్ వ్యాధి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 400 ఎంఎల్ నీటిలో ఈ మొక్క వేర్లను వేసి 100 ఎంఎల్ అయ్యే వరకు మరిగించి వడకట్టాలి. ఇలా మరిగించిన నీటిని తాగడం వల్ల రక్త విరేచనాలు తగ్గుతాయి.
పురుషుల్లో వీర్య కణాల సంఖ్యను పెంచడంలో కూడా ఈ మొక్క ఉపయోగపడుతుంది. ఈ మొక్క ఆకులను సేకరించి ఎండబెట్టి పొడిలా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదుగా ఒక గ్లాస్ పాలలో కలుపుకుని రాత్రి పూట తాగడం వల్ల పురుషులల్లో వీర్య వృద్ధి కలుగుతుంది. నెలసరి సమయంలో అధిక రక్తస్రావం సమస్యతో బాధపడుతున్న స్త్రీలకు అత్తిపత్తి మొక్క దివ్యౌషధంగా పని చేస్తుంది. అత్తిపత్తి మొక్క వేరును దంచి రసాన్ని తీయాలి. ఈ రసానికి నల్ల మిరియాలను, తేనెను కలిపి 3 గంటలకొకసారి తీసుకుంటూ ఉండడం వల్ల అధిక రక్తస్రావం సమస్య తగ్గుతుంది.
ఈ మొక్క వేరు రసాన్ని తీసుకోవడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. కామెర్లను తగ్గించే శక్తి కూడా అత్తిపత్తి మొక్కకు ఉంటుంది. ఈ మొక్క ఆకుల నుండి 25 ఎంఎల్ రసాన్ని తీయాలి. ఈ రసాన్ని రెండు భాగాలుగా చేసి రోజుకు రెండు పూటలా తీసుకుంటూ ఉండాలి. ఇలా మూడు వారాల పాటు చేయడం వల్ల కామెర్ల వ్యాధి నయం అవుతుంది. ఈ మొక్క ఆకుల పేస్ట్ ను తేనెతో కలిపి పరగడుపున తీసుకోవడం వల్ల కడుపు నొప్పి తగ్గుతుంది. పాము కాటుకు గురి అయినప్పుడు ఈ మొక్క వేరు రసాన్ని 10 ఎంఎల్ మోతాదులో తీసుకుని దానిని 400 ఎంఎల్ నీటిలో కలిపి రోజుకు రెండు పూటలా తీసుకోవడం వల్ల విష ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా ఈ విధంగా తాగడం వల్ల షుగర్ వ్యాధి కూడా నయం అవుతుంది.
అత్తిపత్తి మొక్క వేర్ల కషాయాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల దంతాలు గట్టిపడతాయి. గాయాలపై, పుండ్లపై అత్తిపత్తి మొక్క వేర్లను మెత్తగా దంచి ఆ మిశ్రమాన్ని రాయడం వల్ల గాయాలు, పుండ్లు త్వరగా మానిపోతాయి. ఈ విధంగా అత్తిపత్తి మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.