Gaddi Chamanthi Benefits : గడ్డి చామంతి మొక్క… ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్కల్లో ఇది ఒకటి. కానీ చాలా మంది దీనిని ఒక పిచ్చి మొక్కగా భావిస్తూ ఉంటారు. ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనబడుతుంది. దీనిని వైశాలకర్ణి, పలకాకు, గాయపాకు, రావణాసుర తల, నల్లారం అని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. దీనిని సంస్కృతంలో జయంతివేద అని పిలుస్తారు. ఈ మొక్క రెండు అడుగుల పొడవు ఉండి రెమ్మలు పాకుతూ ఉంటాయి. ఈ మొక్క ఆకులు దీర్ఘ అండాకారంలో ప్రస్పుటపు అంచులను కలిగి ఉంటాయి. ఈ గడ్డి చామంతిలో ఆల్కలాయిడ్స్, ప్లేవనాయిడ్స్, కెరొటినాయిడ్స్ తో పాటు క్యాల్షియం, సోడియం, పొటాషియం కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. దీనికి పలకాకు అని పేరు రావడానికి ఒక కారణం ఉంది.
పూర్వకాలంలో మట్టి పలకలను ఎక్కువగా వాడే వారు. ఈ పలకలకు ఈ మొక్క ఆకును రుద్దితే అవి కొత్త పలకల్లా తయారయ్యేవి. దీంతో ఈ మొక్కకు పలకాకు అనే పేరు వచ్చింది. గాయాలు తగిలినప్పుడు ఈ మొక్క ఆకులను నలిపి గాయాలపై ఉంచడం వల్ల రక్తప్రావం ఆగడంతో పాటు గాయాలు కూడా త్వరగా తగ్గిపోతాయి. గడ్డి చామంతిలో ఉండే యాంటీ సెప్టిక్ లక్షణాల కారణంగా గాయాలు త్వరగా మానుతాయి. దగ్గు, ఆయాసం వంటి వాటికి కూడా ఈ మొక్క ఆకురసం దివ్యౌషధంగా పని చేస్తుంది. ఒక టీ స్పూన్ గడ్డి చామంతి మొక్క ఆకురసంలో ఒక టీ స్పూ్ తేనెను కలిపి తీసుకోవడం వల్ల దగ్గు, ఆయాసం వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా ఈ మొక్క ఆకుల రసంతో చర్మ వ్యాధులను కూడా నయం చేసుకోవచ్చు.
గడ్డి చామంతి మొక్క ఆకుల రసాన్ని చర్మంపై పూతగా పూయడం వల్ల గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి. దోమల బెడదను తగ్గించడంలో కూడా ఈ మొక్క మనకు సహాయపడుతుంది. దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మొక్క ఎండిన ఆకులతో ఇంట్లో పొగ పెట్టాలి. దీంతో దోమలు ఇంటి నుండి బయటకు వెళ్లిపోతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలతో బాధపడే వారు ఆవనూనెలో గడ్డి చామంతి మొక్క ఆకులను వేసి నలల్గా అయ్యే వరకు వేయించాలి. తరువాత ఈ నూనెను నొప్పులపై రాయడం వల్ల నొప్పులు తగ్గుతాయి. మధుమేహాన్ని నియంత్రించడంలో ఈ మొక్క మనకు ఉపయోగపడుతుందని ఇటీవల జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. గడ్డి చామంతి మొక్క ఆకులను మెత్తగా నూరి పాము కాటుకు గురైన చోట ఉంచాలి. ఇలా చేయడం వల్ల పాము విషం కొంత మేర హరించుకుపోతుంది.
కొన్ని ప్రాంతాల్లో దీనిని కూరగా వండుకుని తింటారు. ఈ మొక్క ఆకులతో చేసిన కషాయాన్ని తాగడం వల్ల జ్వరం కూడా తగ్గుతుంది. గడ్డి చామంతి ఆకుల రసానికి సమానంగా గుంటగలగరాకు రసం, నువ్వుల నూనె కలిపి నూనె మిగిలే వరకు చిన్న మంటపై వేడి చేయాలి. తరువాత ఈ నూనెను వడకట్టి నిల్వ చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఈ నూనెను తలకు పట్టించి ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు నల్లగా, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఇలా తయారు చేసుకున్న నూనెను వాడడం వల్ల తెల్ల జుట్టు సైతం నల్లగా మారుతుంది. పిచ్చి మొక్కగా భావించే గడ్డి చామంతి మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.