ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా వ‌ద‌లొద్దు.. లివ‌ర్ ను పూర్తిగా బాగు చేస్తుంది.. ఎన్నో స‌మ‌స్య‌ల‌కు ప‌నిచేస్తుంది..!

మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో మ‌న‌కు ఔష‌ధాలుగా ఉప‌యోగ‌ప‌డే ఎన్నో మొక్క‌లు ఉన్నాయి. కానీ మ‌నకు వాటి గురించి తెలియ‌దు. ఈ మొక్క‌లు స‌హ‌జంగానే గ్రామాల్లో మ‌న‌కు ఎక్క‌డ చూసినా క‌నిపిస్తుంటాయి. వీటిల్లో ఔష‌ధ గుణాలు ఎక్కువ‌గా ఉంటాయి. అలాంటి మొక్క‌ల్లో కామంచి మొక్క ఒక‌టి. ఇది చిన్న‌గా, ద‌ట్టంగా పెరుగుతుంది.

health benefits of kamanchi plant

కామంచి మొక్క ట‌మాటా జాతికి చెందిన‌ది. దీన్నే కామాక్షి చెట్టు అని కూడా అంటారు. మిర‌ప చెట్టులా పెరుగుతుంది. దీనికి చిన్న చిన్న పండ్లు పండుతాయి. అవి చూసేందుకు అచ్చం చిన్న టమాటా పండ్ల‌లా ఉంటాయి. అయితే కామంచి మొక్క వ‌ల్ల మ‌న‌కు అనేక అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముఖ్యంగా ఈ మొక్క ఆకుల‌తో మ‌నం లివ‌ర్ ను పూర్తిగా బాగుచేసుకోవ‌చ్చు.

కామంచి మొక్క ఆకులు లివ‌ర్‌కు టానిక్‌లా ప‌నిచేస్తాయి. అందుకు గాను ఈ మొక్క ఆకుల‌ను తెచ్చి దంచి ర‌సం తీయాలి. దాన్ని 20 లేదా 30 ఎంఎల్ మోతాదులో తీసుకుని అందులో కొద్దిగా జీల‌క‌ర్ర పొడి లేదా మిరియాల పొడి క‌లిపి రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగుతుండాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల అన్ని ర‌కాల లివ‌ర్ వ్యాధులు, దోషాలు పోతాయి.

కామంచి మొక్క ఆకుల ర‌సాన్ని పైన చెప్పిన విధంగా సేవించ‌డం వ‌ల్ల లివ‌ర్ పూర్తిగా బాగుప‌డుతుంది. ఎంతో హీన ద‌శ‌లో ఉన్న లివ‌ర్ కూడా ఆరోగ్యంగా మారుతుంది. లివ‌ర్ లోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కుపోతాయి. లివ‌ర్ శుభ్రంగా మారుతుంది. లివ‌ర్ ఇన్ఫెక్ష‌న్లు, కామెర్లు త‌గ్గుతాయి. ఫ్యాటీ లివ‌ర్‌, ఆల్క‌హాలిక్ లివ‌ర్ డ్యామేజ్‌, ఇత‌ర కార‌ణాల వ‌ల్ల డ్యామేజ్ అయిన లివ‌ర్ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అందువ‌ల్ల దీన్ని లివ‌ర్‌కు అద్భుత‌మైన ఔష‌ధంగా చెప్ప‌వ‌చ్చు.

ఇక ఈ మొక్క ఆకుల ర‌సాన్ని రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఆయుర్వేదంలో ఈ మొక్క ఆకుల‌ను స‌జ్జోర‌సాయ‌నంగా పిలుస్తారు. అంటే ఇన్‌స్టంట్ ఇమ్యూనిటీ బూస్ట‌ర్ అన్న‌మాట‌. అందువ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి అమాంతం పెరుగుతుంది. దీంతో వ్యాధులు రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు.

ఇటీవలే కొంద‌రు భార‌తీయ సైంటిస్టులు ఈ మొక్క‌కు చెందిన ఆకుల్లో క్యాన్స‌ర్ల‌ను త‌గ్గించే ఔషధ‌గుణాలు ఉన్నాయ‌ని తేల్చారు. అందుకు సంబంధించి వారు పేటెంట్ హ‌క్కుల‌ను కూడా తీసుకున్నారు.

ఇక ఈ మొక్క ఆకుల ర‌సాన్ని పూసినా లేదా వాటి మిశ్ర‌మంతో క‌ట్టు క‌డుతున్నా.. తేలు కాటు నుంచి విషం హ‌రించుకుపోతుంది. చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

ఈ మొక్క పండ్ల‌ను 20 లేదా 30 సేక‌రించి రోజూ తినాలి. రెండు, మూడు రోజుల్లోనే నోటిపూత నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఈ మొక్క ఆకుల‌ను కూర‌గా వండుకుని తింటే రేచీక‌టి త‌గ్గుతుంది.

ఇన్ని ఔష‌ధ గుణాలు ఉన్నాయి క‌నుక ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా అస్స‌లు విడిచిపెట్ట‌కండి. ఇది మ‌న పరిస‌రాల్లోనే ఎక్కువ‌గా ల‌భిస్తుంది. పెద్ద‌గా శ్ర‌మ ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. కాస్త ఓపిగ్గా వెదికితే ల‌భిస్తుంది.

Share
Admin

Recent Posts