Migraine : మైగ్రేన్ తలనొప్పి వేధిస్తోందా..? ఈ చిట్కాలతో తలనొప్పిని దూరం చేసుకోండి..!

Migraine : ప్రస్తుత కాలంలో చాలా మంది బాధపడుతున్న సమస్యలలో మైగ్రేన్ తలనొప్పి ఒకటి.  చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్ద వారి వరకు ఈ సమస్య అధికంగా వేధిస్తూ ఉంటోంది. ముఖ్యంగా చలి కాలంలో ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే వారి సంఖ్య అధికమవుతోంది. ఇలా మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు ఈ చిట్కాలను ఉపయోగించి.. వెంటనే తల నొప్పిని దూరం చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..

follow these remedies to get rid of Migraine  follow these remedies to get rid of Migraine

1. చలి కాలంలో అధిక చలి తీవ్రత కారణంగా దగ్గు, జలుబు రావడంతోపాటు మైగ్రేన్ తల నొప్పి అధికంగా వస్తుంటుంది. ఈ క్రమంలోనే ప్రతి రోజూ మన ఆహారంలో అల్లంను చేర్చుకోవడం వల్ల జలుబు, దగ్గు తగ్గడంతోపాటు మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. నిత్యం ఉదయాన్నే పరగడుపునే ఒకటి లేదా రెండు టీస్పూన్ల అల్లం రసం సేవిస్తుండాలి. లేదా నీటిలో అల్లం వేసి మరిగించి తాగుతుండాలి. దీంతో మైగ్రేన్‌ తగ్గుతుంది.

2. పలు పరిశోధనల అనంతరం మైగ్రేన్ తలనొప్పిని ఆక్యుప్రెషర్ ప్రక్రియ ద్వారా తగ్గించవచ్చని నిరూపితమైంది. ఇందులో భాగంగా మన చేతివేళ్ళతో తలభాగం దగ్గర బాగా మసాజ్ చేయాలి. దీంతో త్వరగా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

3. లావెండర్ ఆయిల్ తో నొప్పి ఉన్న చోట బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మైగ్రేన్ తలనొప్పి నుంచి బయటపడవచ్చు.

4.  శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ముఖ్యంగా రోజూ ప్రాణాయామం చేయాలి. అదేవిధంగా వీలైనంతవరకు మన శరీరాన్ని వెచ్చగా ఉండేలా చూసుకోవటం వల్ల మైగ్రేన్‌ నుంచి దూరం కావచ్చు.

Sailaja N

Recent Posts