Konda Palleru Kayalu : పొలాల గట్ల మీద, ఇసుక నేలల్లో, బీడు భూముల్లో ఎక్కువగా కనిపించే మొక్కల్లో పల్లేరు కాయల మొక్క కూడా ఒకటి. గ్రామాల్లో ఉండే వారికి ఈ మొక్క గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఈ మొక్క చాలా పదును కలిగిన ముళ్లులను కలిగి ఉంటుంది. ఈ ముళ్లులు కాళ్లల్లో గుచ్చుకుని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పల్లేరు కాయల్లో కూడా రెండు రకాలు ఉంటాయి. చిన్న పల్లేరు కాయలు, కొండ పల్లేరు కాయలు లేదా ఏనుగు పల్లేరు అని రెండు రకాలు ఉంటాయి. చాలా మంది దీనిని పచ్చి మొక్క, కలుపు మొక్కగానే భావిస్తారు. కానీ ఈ మొక్కలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మొక్కను సరైన పద్దతిలో ఉపయోగించడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. పల్లేరు కాయల వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లేరు కాయలను దంచి అశ్వగంధ పాలల్లో వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ పాలను వడకట్టి తాగడం వల్ల అలసట, ఒత్తిడి వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే అధిక బరువు, డయాబెటిస్ వంటి సమస్యలతో బాధపడే వారు ఈ పాలను తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎండిన పల్లేరు కాయలను దంచి పొడిగా చేసుకోవాలి. తరువాత ఈ పొడికి వావిలాకు పొడిని కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. అలాగే స్త్రీలల్లో వచ్చే గర్భాశయ దోషాలు కూడా తగ్గుతాయి. అదే విధంగా పల్లేరు కాయల పొడిని తినడం వల్ల చక్కటి సంతానం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా పల్లేరు కాయలతో కషాయాన్ని చేసి తీసుకోవడం వల్ల పైత్యం వల్ల కలిగే తలనొప్పి తగ్గుతుంది. అంతేకాకుండా పల్లేరు మొక్క పువ్వులు కూడా మనకు ఉపయోగపడతాయి.
ఈ పువ్వులతో కషాయాన్ని చేసి తీసుకోవడం వల్ల దగ్గు, క్షయ వంటి శ్వాస సంబంధిత సమస్యలు తగ్గు ముఖం పడతాయి. మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారికి కూడా పల్లేరు కాయలు ఎంతో సహాయపడతాయి. పల్లేరు కాయల పొడిని పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు తొలగిపోతాయి. మూత్రంలో మంట, మూత్రవిసన్జన సమయంలో నొప్పి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. కొండపల్లేరు కాయల పొడికి, వావిలాకు పొడిని కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని రోజుకు రెండు టీ స్పూన్ల మోతాదులో తీసుకోవడం వల్ల కాలేయం శుభ్రపడుతుంది. మూత్రాశయానికి సంబంధించిన సమస్యలు కూడా మన దరి చేరకుండా ఉంటాయి. కొండపల్లేరు కాయల పొడిని తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. కంటి చూపు మెరుగుపడుతుంది.
అలాగే శరీరంలో నొప్పులు, వాపులు కూడా తగ్గుతాయి. ఈ పొడిని తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. అధిక బరువు సమస్య నుండి కూడా బయటపడవచ్చు. దంతాలు మరియు చిగుళ్ల సమస్యలు కూడా మన దరి చేరకుండా ఉంటాయి. ఈ విధంగా పల్లేరు కాయలు, పువ్వులు మనకు ఎంతో ఉపయోగపడతాయని వీటిని వాడడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.