మొక్క‌లు

Kuppintaku : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి..!

Kuppintaku : చాలా రకాల ఔషధ మొక్కలు మన చుట్టూ కనబడుతూ ఉంటాయి. ఔషధ మొక్కలు ఎన్నో రకాల సమస్యల్ని దూరం చేయగలవు. ఆయుర్వేదం వైద్యం లో చాలా ఔషధ మొక్కలు ని ఉపయోగిస్తూ వుంటారు. ఔషధ గుణాలు వున్న వాటిలో, కుప్పింటాకు కూడా ఒకటి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ కుప్పింటాకుతో చాలా రకాల సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. కుప్పింటాకు ని పేస్ట్ లాగా చేసుకుని, అందులో పసుపు వేసి గాయం తగిలిన చోట రాస్తే, గాయం త్వరగా మానిపోతుంది.

అలానే, దద్దుర్లు ఉన్నచోట రాస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ప్రతి చిన్న సమస్యకి మందుల్ని వాడే బదులు, చిన్నచిన్న ఇంటి చిట్కాలతో మనం సమస్యని వదిలించుకోవచ్చు. అయితే, ఈ కుప్పింటాకు మొక్క చాలా అరుదుగా దొరుకుతుంది. ఎక్కడ పడితే అక్కడ ఇది ఉండదు. కుప్పింటాకు మొక్క పంటి నొప్పిని కూడా బాగా తగ్గించగలదు. ఈ కారణంగానే దీనిని పిప్పింటాకు అని కూడా పిలుస్తారు.

kuppintaku benefits do not forget to bring it to home

పంటి నొప్పిలన్నింటికీ కూడా ఔషధంలా ఇది పనిచేస్తుంది. ఈ మొక్క వేళ్ళతో పళ్ళను తోముకోవడం వలన, పళ్ళు తెల్లగా వస్తాయి. చిగుళ్ళ నుండి కారే రక్తాన్ని కూడా, ఈ ఆకు ఆపుతుంది. ఈ ఆకు రసం రెండు చుక్కల్ని, ముక్కులో వేసుకుంటే, మొండి తలనొప్పి కూడా ఈజీగా తగ్గిపోతుంది. ఈ ఆకులని మిరియాలంతో పాటుగా నూరి, తేలుకాటుకి, పాము కాటుకి కడితే, విషయాన్ని తీసేస్తుంది.

నిద్రపోయే ముందు రెండు స్పూన్లు పిప్పింటాకు రసాన్ని తాగడం వలన, మలబద్ధకం, నులిపురుగులు వంటి సమస్యలు వుండవు. కళ్ళు ఎర్రబడటం, జ్వరం, వాంతులు, కఫం వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. మొటిమలు, అవాంఛిత రోమాలు పోవడానికి కూడా ఈ ఆకు బాగా పనిచేస్తుంది. ఇలా, అనేక రకాల లాభాలను ఈ మొక్క మనకి ఇస్తుంది.

Share
Admin

Recent Posts