Mulla Thotakura : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. ఆకు కూరలని చాలా మంది ఎక్కువగా తింటుంటారు. కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం వలన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. పంట పొలాల్లో చూసినట్లయితే ఎక్కువగా మనకి కలుపు మొక్కలు కనబడుతుంటాయి. కొన్ని కలుపు మొక్కలు ఆరోగ్యానికి మేలు చేసేవి కూడా. వాటిలో ఉన్న ప్రయోజనాల గురించి తెలియ, చాలా మంది వాటిని పట్టించుకోరు. పైగా కలుపు మొక్కల్ని తీసేసి, పారేస్తూ ఉంటారు.
కానీ ఈ మొక్కల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. వరి పొలాల్లో ఎక్కువగా ఈ ముళ్ళ తోటకూర మనకు కనపడుతూ ఉంటుంది. దీని వలన కలిగే లాభాలను చూస్తే ఆశ్చర్యపోతారు. ఈ ఆకుకూర కొమ్మల చివర ముళ్ళు ఉంటాయి. దీనిని ముళ్ళ తోటకూర అని పిలుస్తారు. ముళ్ళ తోటకూర ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు రంగులలో లభిస్తుంది. దీనిని తీసుకోవడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి.
ఎన్నో రకాల పోషకాలని పొందొచ్చు. ఈ చెట్టు వేర్లని కడిగి ఆరబెట్టుకొని నిల్వ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడే వాళ్ళు ఈ వేర్లను సానపెట్టేసి, అరగదీసి గ్లాసు నీటిలో అర టీస్పూన్ మిశ్రమాన్ని కలుపుకొని కనుక తీసుకున్నట్లయితే కిడ్నీలో రాళ్ల సమస్య నుండి బయటపడొచ్చు.
గాయాలు కనుక అయినట్లయితే ఈ ముళ్ళ తోటకూరని తీసుకుని పేస్ట్ లాగా చేసుకుని రాస్తే రక్తం కారదు. తొందరగా గాయం మానిపోతుంది. దద్దుర్లు వచ్చినప్పుడు కూడా దీనిని రాసుకోవచ్చు. అలా రాస్తే తొందరగా దద్దుర్లు తగ్గిపోతాయి. ఒకవేళ కనుక దీనిని మీరు వాడుకోవాలి అనుకుంటే కచ్చితంగా వైద్యుని సలహా తీసుకోండి. లేదంటే అనవసరంగా ఇబ్బందులు కలగవచ్చు. సివియర్ గా వున్నప్పుడు అయితే మాత్రం అస్సలు వాడకూడదు.