Radish Leaves : మనం ముల్లంగిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ముల్లంగిలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయనన్న సంగతి మనకు తెలిసిందే. ముల్లంగిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ముల్లంగిని జ్యూస్ గా చేసి తీసుకోవడంతో పాటు దీనితో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. అయితే ముల్లంగితో పాటు ముల్లంగి ఆకులు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని కూడా మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ముల్లంగి ఆకుల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిలో విటమిన్ ఎ, సి, కె లతో పాటు క్యాల్షియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు ఉన్నాయి. ముల్లంగి ఆకులను తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముల్లంగి ఆకులను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. అలాగే ముల్లంగి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటాము.
శరీరంలో మలినాలను తొలగించే శక్తి కడా ఈ ఆకులకు ఉంది. ముల్లంగి ఆకులను తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో మూత్రం ఎక్కువగా తయారవుతుంది. ఈ మూత్రం ద్వారా మలినాలు, విష పదార్థాలు తొలగించబడతాయి. అలాగే ఈ ఆకులను ఆహారంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముల్లంగి ఆకులను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఈ ఆకుల్లో ఉండే ఫైబర్ మలబద్దకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే షుగర్ తో బాధపడే వారు ముల్లంగి ఆకులను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆకులను తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, హార్ట్ ఎటాక్ వంటి వ్యాధుల బారిన పడకుండా చేయడంలో కూడా ముల్లంగి ఆకులు మనకు సహాయపడతాయి. అంతేకాకుండా ఈ ఆకులను ఆహారంగా తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ ఆకులు యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో వాపులు, నొప్పులు తగ్గుతాయి. ఈ విధంగా ముల్లంగి ఆకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని ఈ ఆకులతో పప్పు, పచ్చడి వంటి వాటితో పాటు ఇతర ఆకుకూరలతో కూడా వేయించి తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.