Shankhpushpi : మన ఇంటి ముందు పెరట్లో అనేక రకాల పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. మన ఇంటికి చక్కటి అందాన్ని తెచ్చే తీగ జాతిక చెందిన పూల మొక్కల్లో శంఖు పూల మొక్క కూడా ఒకటి. ఇది మనకు నీలం, తెలుపు రంగుల్లో లభిస్తూ ఉంటుంది. ఈ పూలు శంఖు ఆకారంలో ఉంటాయి కనుక ఈ మొక్కకు శంఖు పూల మొక్క అనే పేరు వచ్చింది. ఈ పూలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. భగవంతుని ఆరాధనకు కూడా ఈ పూలు మనకు ఉపయోగపడతాయి. అందంతో పాటు ఈ శంఖు పూలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ పూలతో కషాయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పూల కషాయం యాంటీ క్యాన్సర్ గా పని చేస్తాయని 2021 వ సంవత్సరంలో పోలెండ్ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
మూడు లేదా నాలుగు శంఖు పూలను పావు లీటర్ నీటిలో వేసి పావు గంట పాటు మరింగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి గ్లాస్ లోకి తీసుకుని తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవాలి. ఈ విధంగా శంఖు పూల కషాయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల ఆంథోసైనిస్ మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఈ ఆంథోసైనిస్ శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో సహాయపడతాయి. సాధారణ కణాలను కూడా క్యాన్సర్ కణాలుగా మార్చే ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో శంఖు పూల కషాయం ఎంతగానో ఉపయోగపడుతుంది అని నిపుణులు చెబుతున్నారు. అలాగే దీనిలో ఉండే టెర్నాటిన్స్ క్యాన్సర్ కణాల చుట్టూ ఉండే ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో, అదే విధంగా క్యాన్సర్ కణాలు విభజన చెందకుండా చేయడంలో క్యాన్సర్ కణాల వ్యాప్తిని తగ్గించడంలో చక్కగా పని చేస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
అదే విధంగా శంఖు పూల కషాయంలో డెల్ ఫ్రిడిన్ 35 గ్లూకో సైడ్ అనే రసాయన సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రేగుల క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కాలేయ క్యాన్సర్ వంటి వాటిని రాకుండా చేయడంలో ఉపయోగపడుతుందని నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు. ఈ శంఖు పూల కషాయాన్ని టీ లాగా తాగడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటామని వారు తెలియజేసారు. ఈ కషాయం యాంటీ క్యాన్సర్ గా పని చేయడంతో పాటు దీనిని తాగడం వల్ల మనం ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చని వారు చెబుతున్నారు. ఈ పూల కషాయం తాగడం వల్ల ఆల్జీమర్స్, నిద్రలేమి వంటి సమస్యలు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.