పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలతో పోలిస్తే ధనికులు చేసే భోజనం ఖర్చు సహజంగా ఎక్కువగానే ఉంటుంది. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. ఇక దేశంలోని రాజకీయ నాయకులు కూడా ఇదే కోవ కిందకు వస్తారు. ఎందుకంటే వారు కూడా సెలబ్రిటీలే కదా. దీంతోపాటు పదవీ, హోదా ఉంటాయి. ఆ క్రమంలో అలాంటి నాయకులు రోజూ చేసే భోజనం ఖరీదు కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇది సరే.. మరి మన దేశ ప్రధాని మోడీ రోజూ చేసే భోజనం ఖర్చు ఎంతో తెలుసా..? ఈ విషయంపై గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఆయనపై అనేక ఆరోపణలు చేశారు. కానీ నిరూపించలేకపోయారు.
ప్రధాని మోదీ శాకాహారమే తింటారట. ఆయన ఆవు నెయ్యితో తయారు చేసిన కిచిడీతోపాటు ఉడికించిన కూరగాయలు, పండ్లను తింటారు. శనగ పిండితో చేసిన రొట్టెలు, బెండకాయల కూర, పుల్కా, పప్పు, కూరగాయలు, కాస్త రైస్ తింటారు.
మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత ఎప్పుడైనా షీర్‌ఖండ్ తింటారట. సాయంత్రం సమయంలో ఆయన భోజనాన్ని త్వరగా ముగిస్తారు. ఆయన ఉదయం 4 గంటలకు వ్యాయామం చేస్తారు. యోగా తప్పనిసరిగా చేస్తారు. అందుకనే ఆయన ఈ వయస్సులోనూ అంత ఆరోగ్యంగా ఉంటారు. ప్రధాని మోదీ దుర్గామాత ఉపాసకులు. ఆయన పూజలు కూడా ఎక్కువగానే చేస్తుంటారు. చాలా వరకు ఆయన ఉపవాసం కూడా చేస్తుంటారు. ఆయన ఆరోగ్య రహస్యాల్లో ఇది కూడా ఒకటి. అయితే ఇతర రాజకీయ నాయకులతో పోలిస్తే ఆయన భోజనానికి అయ్యే ఖర్చు తక్కువే. పార్లమెంట్‌లో ఉంటే కేవలం మీల్స్‌తో సరిపెట్టేస్తారు. దాని ఖరీదు కూడా రూ.50. ఇంట్లో ఉన్నా కూడా ఆయన ఇదే ఆహారాన్ని తింటారు.