నేను చెన్నై లో ఉన్నాను కాబట్టి, నాకు తెలిసినంత వరకూ చెపుతాను , ఆయన పాలన బిజినెస్ మేన్ సినిమా లో మహేష్ బాబు డైలాగ్ లాగా.. పెద్దొళ్లను కొట్టేదాం , పేదోళ్లకు పెట్టేదాం , అంటే ఆయన ఎన్ని కుంభకోణాలు చేసినా పేదల నిత్యావసర వస్తువుల ధరలలో ఎలాంటి మార్పులు లేకుండా చూసుకున్నారు . అంటే పప్పు , ఉప్పు, బియ్యం, కాయగూరలు ,వీటి ధరలు అయన హయాంలో ఎక్కువ అయినట్టు దాఖలాలు లేవు . అప్పట్లో కామరాజర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు , పేద వారికి చదువు నేర్పించాలనే ఉదేశ్యంతో , మధ్యాహ్న భోజన పథకం పెట్టారు , అంటే ఒక పూట భోజనం కోసమైనా పేద వారు వాళ్ళ పిల్లలను స్కూలుకి పంపుతారు అని , ఇక్కడ M.G.R ఏం చేశారంటే , మీకు పోషకాహారం లేని అన్నం ఎందుకు , నేను వారానికి రెండు రోజులు గుడ్డును చేర్చుతాను అనే సరికి పేద ప్రజలు అదే మహాభాగ్యం గా భావించారు .
అప్పట్లో సోషల్ మీడియా అంతగా లేదు , ఉండే మీడియా దూర్ దర్శన్ , సినిమా . దూర్ దర్శన్ ఎలాగో ప్రభుత్వం చెప్పేదే చేస్తుంది , ఇక ఆయన నటించే అన్నీ సినిమాల లోను పాటలు , డైలాగులు ప్రజలకు నచ్చే విధంగా , ప్రజలను ఆకర్షించే విధంగా ఉండేలా ప్లాన్ చేసి అమలుచేశారు . అలా M.G.R. ప్రజలకు దేవుడయ్యారు. ఎంతవరకు ప్రజలు నమ్ముతున్నారంటే , ఇప్పుడు కూడా తమిళనాడులోని కొన్ని గ్రామాలకు వెళ్ళి ఎం.జి.ర్. చనిపోయారు అంటే నమ్మరు, ఇంకా మాట్లాడితే మనల్ని కొడుతారు కూడా .
ఒక ఎలెక్షన్ కి జయలలిత , M.G.R ఫోటో లేకుండా , ఆవిడ పార్టీ సింబల్ ని, ఆవిడ ఫోటోని మాత్రం పెట్టి , ప్రచారం చేస్తే , M.G.R ఫోటో లేనందువలన , అది ఆయన పార్టీని కాదని ఓటు వెయ్యలేదంట , అలా ఆవిడ ఓడిపోయింది . కానీ ఆయన చేసిన దుర్మార్గాలు , రాసలీలలు , ఆయన చనిపోయిన తరువాత కూడా , ప్రజలకు తెలియకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు ,