సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నా బ్రతుకు రోడ్డు వైండింగ్‌లో కొట్టుకుపోయిన ఇల్లులా ఉంది. ఉండడానికి పనికిరాదు, తీసేయడానికి మనసొప్పదు అనే ఓ డైలాగ్ ఉంటుంది గుర్తుకొచ్చిందా..? ఇప్పుడు మీరు చదవబోయే స్టోరీ అచ్చు గుద్దినట్టు అలానే అనిపిస్తుంది. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పటౌడీ వంశానికి పదవ నవాబు. ఈ స్టార్ హీరో తండ్రి దివంగత మన్సూర్ అలీ ఖాన్ పటౌడి నుండి దీన్ని వారసత్వంగా పొందాడు. సైఫ్ తండ్రి అలీ ఖాన్ భారత క్రికెట్ జట్టులో ఆడాడు. 2011లో మన్సూర్ అలీ ఖాన్ మరణానంతరం హర్యానాలోని పటౌడీ ఊర్లో సింబాలిక్ పగ్రీ వేడుక జరిగింది. సైఫ్ అతన్ని పటౌడీకి పదవ నవాబుగా పట్టాభిషేకం చేశారు. ఆ ఊరి మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకే ఖాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సైఫ్ తన కుటుంబ సంప్రదాయాన్ని కొనసాగించాడు. సైఫ్ అలీ ఖాన్‌కు ఇద్దరు చెల్లెళ్లు. అందులో ఒకరు ప్రముఖ నటి సోహా అలీ ఖాన్, మరోకరు సబా అలీ ఖాన్… వీరంతా నవాబు కుటుంబానికి చెందిన వారసులు. సైఫ్‌కు హర్యానాలోని పటౌడీ ప్యాలెస్‌తో పాటు భోపాల్‌లోని ఇతర పూర్వీకుల ఆస్తులు విలువ మొత్తం అక్షరాల రూ. 5,000 కోట్లు. కాగా సైఫ్ అలీఖాన్ తండ్రి, తాత సమాధులు హర్యానాలో ఉన్నాయి. తన తండ్రి నుండి ఆస్తిని వారసత్వంగా పొందడంతో, సైఫ్ తన పిల్లలైన సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్, తైమూర్ అలీ ఖాన్‌తో పాటు జహంగీర్ అలీ ఖాన్‌లను కూడా వారసత్వంగా పొందడం ఆనవాయితి. అయితే ఇక్కడ న్యాయపరమైన చిక్కు ఒకటుంది.
అదేంటంటే.. బాలీవుడ్‌లైఫ్ నివేదిక ప్రకారం, హౌస్ ఆఫ్ పటౌడీ భారత ప్రభుత్వానికి సంబంధించిన వివాదాస్పద శత్రు వివాదాల చట్టం కిందకు వస్తుంది. కాబట్టి ఎవరూ దానిని వారసులుగా చెప్పుకోలేరు. హౌస్ ఆఫ్ పటౌడీకి చెందిన అన్ని ఆస్తులు మరియు ఇతర సంబంధిత ఆస్తులన్నీ అదే చట్టం కిందకు వస్తాయి. దాంతో అలాంటి ఆస్తికి ఎవరూ వారసులమని చెప్పలేరు. ఈ చట్టం పరిధిలోకి వచ్చే ఆస్తులు తమకు చెందవని చెబుతున్నారు. అయితే ఈ కుంటుంబానికి చెందిన వ్యక్తి ఆస్తులను క్లెయిమ్ చేయాలనుకుంటే, ఆ ఆస్తి తమదని నమ్మితే, వాళ్లు హైకోర్టు, అది విఫలమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. అక్కడ కూడా న్యాయం జరగక పోతే చివరకు రాష్ట్రపతిని ఆశ్రయించవచ్చు. ఇక సైఫ్ అలీఖాన్ దేవర సినిమాలో విలన్‌గా చేశాడు. ఈ మూవీలో బైరాగా సైఫ్ కనిపించాడు. సైఫ్‌కు ఇది తొలి తెలుగు సినిమా. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలో చేశాడు కానీ.. అది హిందీ మేకర్స్ తీశారు.