Eggs : కోడిగుడ్ల‌ను తింటే బీపీ పెరుగుతుందా ?

Eggs : కోడిగుడ్ల‌ను మ‌నం రోజూ ర‌క‌ర‌కాలుగా తింటుంటాం. కొందరు వీటిని ఆమ్లెట్ల రూపంలో తినేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. కొంద‌రు వీటిని ఉడ‌క‌బెట్టి తింటారు. ఇక జిమ్‌లు చేసేవారు ఉద‌య‌మే వీటిని తింటారు. కోడిగుడ్ల‌తో మనం అనేక ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే కోడిగుడ్లను తింటే బీపీ పెరుగుతుందా ? హైబీపీ ఉన్న‌వారు కోడిగుడ్ల‌ను తిన‌కూడ‌దా ? అని చాలా మందికి అనేక సందేహాలు వ‌స్తుంటాయి. ఇక వీటికి నిపుణులు ఏమ‌ని స‌మాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

can eating Eggs causes high blood pressure
Eggs

కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల బీపీ పెరుగుతుంద‌ని అన‌డంలో ఎంత‌మాత్రం నిజం లేదు. అంతా అబ‌ద్ద‌మే. వాస్త‌వానికి కోడిగుడ్ల‌ను తింటే బీపీ పెర‌గ‌దు, త‌గ్గుతుంది. బీపీ త‌గ్గేందుకు ఇవి మేలు చేస్తాయి. క‌నుక కోడిగుడ్ల‌ను ఎవ‌రైనా తిన‌వ‌చ్చు. ఇక బీపీ త‌గ్గుతుంది క‌నుక హైబీపీ ఉన్న‌వారు కూడా కోడిగుడ్ల‌ను నిర్భ‌యంగా తిన‌వ‌చ్చు. ఇందులో సందేహించాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే కోడిగుడ్ల‌లో లెసిథిన్ అనే పోష‌క ప‌దార్థం ఉంటుంది. ఒక మీడియం సైజ్ కోడిగుడ్డులో సుమారుగా 700 మిల్లీగ్రాముల మేర లెసిథిన్ ఉంటుంది. ఇది హైబీపీని త‌గ్గిస్తుంది. అలాగే కొలెస్ట్రాల్‌, లిపిడ్ స్థాయిల‌ను త‌గ్గిస్తుంది. క‌నుక కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల బీపీ త‌గ్గ‌డ‌మే కాదు.. కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ కూడా త‌గ్గుతాయి. కాబ‌ట్టి కోడిగుడ్ల‌ను ఎవ‌రైనా స‌రే నిర్భ‌యంగా తిన‌వ‌చ్చు. ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన ప‌నిలేదు.

ఇక కోడిగుడ్ల‌లో అత్యుత్త‌మమైన ప్రోటీన్లు, కొవ్వులు, విట‌మిన్లు, కొలెస్ట్రాల్, మిన‌ర‌ల్స్ ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఐర‌న్‌, కాల్షియం, పొటాషియం వంటి పోష‌కాలు ఉంటాయి. ఇవి మన శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక మ‌న శ‌రీరం రోజూ త‌న‌కు అవ‌స‌రమైన కొలెస్ట్రాల్‌లో 80 శాతం కొలెస్ట్రాల్‌ను త‌న‌కు తానే త‌యారు చేసుకుంటుంది. ఈ క్ర‌మంలోనే కోడిగుడ్ల‌లోనూ కొలెస్ట్రాల్ ఉంటుంది. కానీ అందులో 30 శాతాన్ని మాత్ర‌మే శ‌రీరం శోషించుకుంటుంది. దీని వ‌ల్ల ఒక గుడ్డులోని 290 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్‌లో మ‌న శరీరం 87 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్‌ను మాత్ర‌మే శోషించుకుంటుంది. అంటే రెండు గుడ్ల‌ను తింటే దాదాపుగా 174 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్‌ను మాత్ర‌మే శ‌రీరం గ్ర‌హిస్తుంది. మ‌నం రోజుకు 300 మిల్లీగ్రాముల మేర కొలెస్ట్రాల్ ను తీసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే రెండు గుడ్ల ద్వారా మ‌న‌కు 174 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ల‌భిస్తుంది. అంటే ఇది మ‌నకు రోజుకు విధించిన ప‌రిమితి 300 మిల్లీగ్రాముల క‌న్నా చాలా త‌క్కువ‌. అందులో దాదాపుగా స‌గం అని చెప్ప‌వచ్చు. అంటే రోజుకు రెండు గుడ్ల వ‌ర‌కు తిన‌వ‌చ్చ‌న్న‌మాట‌. వీటి ద్వారా ల‌భించే కొలెస్ట్రాల్ ప్రభావం మ‌న‌పై పెద్ద‌గా ప‌డ‌దు. కాబ‌ట్టి కోడిగుడ్ల‌ను ఎవరైనా స‌రే రోజూ ఎలాంటి భ‌యం లేకుండా నిరభ్యంత‌రంగా తిన‌వ‌చ్చు. ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన ప‌నిలేదు. ఎవరైనా వీటిని రోజూ తిన‌వ‌చ్చు.

Share
Editor

Recent Posts