ఖర్జూరాలు ఎంతో తియ్యగా ఉంటాయి. అందువల్ల వీటిని తినేందుకు చాలా మంది ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. అయితే ఖర్జూరాలను తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. వాటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. అందువల్ల రోజూ కనీసం 3 ఖర్జూరాలను అయినా సరే తినాలని వైద్యులు చెబుతుంటారు.
ఖర్జూరాలను తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. వాటిల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కండరాల నిర్మాణం జరుగుతుంది. శక్తి లభిస్తుంది. ఖర్జూరాల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. విటమిన్లు బి1, బి2, బి3, బి5 లతోపాటు విటమిన్ ఎ, సిలు కూడా ఉంటాయి. అందువల్ల అనేక పోషకాలు లభిస్తాయి.
ఖర్జూరాలను తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. నాడీ మండల వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఇక ఖర్జూరాల్లో ఐరన్, కాపర్, మాంగనీస్ వంటి మినరల్స్ అధికంగా ఉంటాయి. అందువల్ల శరీరంలో రక్తం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు రోజూ 3 ఖర్జూరాలను తింటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.
ఖర్జూరాలను రోజూ 3 చొప్పున నెల రోజుల పాటు కొందరికి ఇచ్చి తినమని చెప్పగా, వారిలో చివరకు హిమోగ్లోబిన్ స్థాయిలు, రక్తం పెరిగినట్లు సైంటిస్టులు గుర్తించారు. అందువల్ల రక్తహీనత ఉన్నవారికి ఖర్జూరాలను మంచి ఆహారంగా చెప్పవచ్చు. ఇరాన్‌లోని జహెడాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు చెందిన పరిశోధకులు ఆ పరిశోధన చేపట్టారు. అందువల్ల రక్తం తక్కువగా ఉన్నవారు ఖర్జూరాలను తింటే రక్తం పెరుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.