భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి మెంతులను తమ వంట ఇంటి దినుసుల్లో ఒకటిగా ఉపయోగిస్తున్నారు. మెంతులను చాలా మంది కూరలు, పచ్చళ్లలో పొడి రూపంలో ఎక్కువగా వేస్తుంటారు. అయితే మెంతుల వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. మెంతులతో తయారు చేసుకునే నీటిని తాగడం వల్ల మనకు పలు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
* ఒక పాత్రలో 2 గ్లాసుల నీటిని తీసుకుని అందులో 1 టీస్పూన్ మెంతులను వేసి బాగా మరిగించాలి. మెంతుల రంగు పూర్తిగా మారి నీరు ఆ రంగులోకి వచ్చాక ఆ మిశ్రమాన్ని సేకరించి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. దీని వల్ల మలబద్దకం తగ్గుతుంది.
* మెంతులతో తయారు చేసుకునే ఆ నీటిని సేవించడం వల్ల రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఇలా తాగితే ఎంతగానో మేలు జరుగుతుంది.
* టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి మెంతులు దివ్య ఔషధం. కనుక వారు ఈ నీటిని తాగితే షుగర్ లెవల్స్‌ను అదుపులోకి తేవచ్చు. దీంతో డయాబెటిస్ బాధించదు.
* గుండె, ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా ఉండాలన్నా.. ఆయా వ్యాధులు ఉన్నవారు వాటి నుంచి బయట పడాలన్నా.. మెంతుల నీటిని వారంలో కనీసం 3 నుంచి 4 సార్లు అయినా తాగాల్సి ఉంటుంది.