ప్ర‌శ్న - స‌మాధానం

చేప‌ల‌కూర తిన్న వెంట‌నే పెరుగు తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుంది..?

నిత్యం మ‌నం అనేక ర‌కాల ఆహారాల‌ను తింటుంటాం. అయితే కొన్ని ప‌దార్థాల‌ను తెలియ‌క మ‌నం కాంబినేష‌న్‌లో తింటాం. కానీ కొన్నింటిని మాత్రం అలా కాంబినేష‌న్‌లో తిన‌కూడ‌దు. తింటే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఇక ఏయే ఆహారాల‌ను క‌లిపి తిన‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందాం. తేనె, నెయ్యి క‌లిపి తిన‌కూడ‌దు. ఈ రెండింటి క‌ల‌యిక విష‌పూరితం అవుతుంద‌ని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అలాగే పెరుగు లేదా మ‌జ్జిగ‌ను అర‌టి పండుతో క‌లిపి తిన‌కూడ‌దు. అన్నాన్ని పండ్ల‌తో క‌లిపి తిన‌కూడ‌దు. అలా తింటే పండ్ల‌లో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం స‌రిగ్గా శోషించుకోలేదు.

కూర‌గాయ‌ల‌తో క‌లిపి వెన్న‌ను తిన‌కూడ‌దు. ఆరోగ్యానికి హాని చేస్తుంది. చేప‌ల‌కూర తిన్న వెంట‌నే పాలు లేదా పెరుగు తీసుకోకూడ‌దు. అలా తింటే కుష్టు రోగం వ‌స్తుంద‌ట‌. లావుగా ఉన్న‌వారు బియ్యంతో వండిన‌వి కాకుండా గోధుమ‌ల‌తో వండిన ఆహారాల‌ను తింటే మంచిది. ఆస్త‌మా ఉన్న వారు ట‌మాటా, గుమ్మ‌డికాయ‌, ముల్లంగి తిన‌కూడ‌దు. ఆస్త‌మా ఉఉన్న‌వారు త‌ల‌పై తేమ లేకుండా చూసుకోవాలి. మొల‌ల స‌మ‌స్య ఉన్న‌వారు గుడ్లు, మాంసం తిన‌కూడ‌దు. తింటే స‌మ‌స్య ఎక్కువ‌వుతుంది. నెయ్యిని రాగి పాత్ర‌లో ఉంచి తిన‌కూడ‌దు. పొద్దునే బెడ్ కాఫీ లేదా టీ తాగ‌డం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఉద‌యాన్నే నీరు తాగిన త‌రువాత టీ, కాఫీ తాగ‌వ‌చ్చు.

can we take curd after eating fish curry

అల్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న వారు కారాన్ని ఎట్టి ప‌రిస్థితిలోనూ తిన‌కూడ‌దు. చ‌ర్మ వ్యాధులు ఉన్న‌వారు పొట్ల‌కాయ‌ను తిన‌కూడ‌దు. ప‌ల్లీలు, ఎండు చేప‌లు, చిక్కుడు కాయ‌లను కూడా తిన‌కూడ‌దు. నువ్వుల నూనెతో గోధుమ‌ల‌ను క‌లిపి వండి తిన‌కూడ‌దు. మోకాళ్ల నొప్పులు ఉన్న‌వారు మాంసం, గుడ్ల‌ను తిన‌క‌పోవ‌డ‌మే మంచిది. ఇలా కొన్ని ఆరోగ్య సూత్రాల‌ను పాటిస్తే రోగాలు రాకుండా చూసుకోవ‌చ్చు. ఆరోగ్యంగా ఉంటారు.

Admin

Recent Posts