హెల్త్ టిప్స్

మార్నింగ్ లేవ‌గానే టీ తాగుతున్నారా.. బీకేర్‌ఫుల్‌..!

ప్రపంచవ్యాప్తంగా అత్యధికమందిచే సేవింపబడే పానీయము ‘టీ’ మరియు చాలామంది ప్రజలు ఒక కప్పు టీని తాగడం ద్వారా వారి రోజును ప్రారంభిస్తారు. సాధార‌ణంగా ఆఫీసుల్లో పనులతో అలసిపోయినా.. ఇంటి పనులతో తలమునకలైనా మొదటిసారిగా గుర్తొచ్చేది టీనే.. ఒక కప్పు పొగలు కక్కే టీ తాగడం వల్ల అప్పటి వరకూ ఉన్న ఒత్తిడి అంతా ఒక దెబ్బతో పోతుంది. ఇక కొంద‌రు అస‌లు ప్రోద్దున్నే టీ తాగితే కానీ.. ఏ పని చేయలేం అన్నంత‌గా దానిని అల‌వాటుగా మార్చుకుంటారు. మరైతే ఇంతగా అలవాటు అయినా టీ ని తాగడం మంచిదా? చెడ్డదా? అనే విషయం చాలా మంది ని వేధిస్తుంది. పూర్వము మన పూర్వికులకి ఛాయ్ అంటే ఏంటో తెలియదు. బ్రిటిష్ వాళ్ళు మన భారత దేశానికి వచ్చినప్పుడు చైనా నుండి ఈ ఛాయ్ కల్చర్ ని తీసుకు వచ్చారు.

అయితే రోజూ పరగడపున టీ తాగడం వల్ల పొట్టలో గ్యాస్టిక్ మ్యూకస్ ఏర్పడుతుంది. దాంతో ఆకలి తగ్గిపోతుంది. టీ అసిడిక్ స్వభావం కలిగి ఉంటుంది . కాబట్టి, పరగడుపున టీ తాగడం వల్ల ఎసిడిటికి కారణమవుతుంద‌ని అంటున్నారు నిపుణులు.

if you are drinking daily tea in the morning then know this

మ‌రియు రోజూ 4 నుండి 5 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగడం వల్ల పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదం ఉంది. టీలో కెఫిన్ అధికంగా ఉండటం వల్ల నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. 5 నుండి 8 కప్పుల టీ తాగే వారిలో దీర్ఘ కాలంలో నిద్రలేమి సమస్యలకు దారితీస్తుంది. అయితే మార్నింగ్ టీ అల‌వాటు ఉన్న‌వారు లేవ‌గానే కాకుండా కాస్త లేటుగా.. లిమిట్ తాగాలంటున్నారు నిపుణులు.

Admin

Recent Posts