Jeans : బిగుతుగా ఉండే జీన్స్‌ను ధ‌రించ‌డం వ‌ల్ల పురుషుల్లో శృంగార స‌మ‌స్య‌లు వ‌స్తాయా..? పిల్ల‌లు పుట్ట‌రా..?

Jeans : స్త్రీ, పురుషుల్లో శృంగార స‌మ‌స్య‌లు రావ‌డం అనేది స‌హ‌జ‌మే. స్త్రీ లేదా పురుషుడు.. ఇద్ద‌రిలోనూ కొన్ని సంద‌ర్భాల్లో ఈ విధంగా స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. దీంతో శృంగారంలో పాల్గొన‌లేక‌పోతుంటారు. దానిపై పెద్ద‌గా ఆసక్తి ఉండ‌దు. అయితే ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. ఇక బిగుతుగా ఉండే జీన్స్‌ను ధరించ‌డం వ‌ల్ల పురుషుల్లో శృంగార స‌మ‌స్య‌లు వ‌స్తాయా ? వారికి పిల్ల‌లు పుట్టే అవ‌కాశాలు త‌గ్గిపోతాయా ? అంటే.. అందుకు వైద్య నిపుణులు ఏమ‌ని స‌మాధానాలు చెబుతున్నారంటే..

does wearing tight jeans cause male fertility problems

బిగుతుగా ఉండే జీన్స్ లేదా ఇత‌ర దుస్తుల‌ను ధ‌రిస్తే పురుషుల్లో వృష‌ణాల‌కు ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా జ‌ర‌గ‌దు. దీంతో వీర్యం ఉత్ప‌త్తి త‌గ్గిపోతుంది. వృష‌ణాలు శ‌రీరం ద‌గ్గ‌ర‌గా ఉంటాయి. దీంతో శ‌రీర ఉష్ణోగ్ర‌త‌కు వృషణాలు ప్ర‌భావితం అవుతాయి. క‌నుక వీర్యం త‌క్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది. అలాగే ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా ఉండ‌దు క‌నుక జ‌న‌నావ‌య‌వాలు బ‌ల‌హీనంగా మారుతాయి. ఈ విష‌యంలో వాస్త‌వం ఉన్న‌ప్ప‌టికీ.. దీని వ‌ల్ల పురుషుల శృంగార సామ‌ర్థ్యంపై ఎలాంటి ప్ర‌భావం ప‌డ‌దు.

బిగుతుగా ఉండే దుస్తుల‌ను ధ‌రించ‌డం ఒక్క‌టే పురుషుల శృంగార సామ‌ర్థ్యంపై ప్ర‌భావాన్ని చూపించ‌దు. ఇంకా అనేక కార‌ణాల వ‌ల్ల వారిలో ఆ స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. క‌నుక బిగుతైన జీన్స్ లేదా దుస్తులను ధ‌రించ‌డం వ‌ల్లే ఈ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని చెప్ప‌లేం.

అయితే సంతానాన్ని ఆశిస్తున్న పురుషులు లేదా శృంగార సామ‌ర్థ్యం త‌క్కువ‌గా ఉన్న‌వారు మాత్రం బిగుతైన దుస్తుల‌ను ధ‌రించ‌క‌పోవ‌డ‌మే మంచిది. వారిలో అవి కొద్దిగా ప్ర‌భావాన్ని చూపినా.. ఫ‌లితం ఎక్కువ‌గా ఉండే అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక అలాంటి వారు బిగుతైన జీన్స్ లేదా ఇత‌ర దుస్తుల‌ను ధ‌రించ‌రాదు. మిగిలిన పురుషులు త‌మ ఇష్టానికి అనుగుణంగా దుస్తుల‌ను ధ‌రించ‌వ‌చ్చు. దాంతో శృంగార జీవితంపై ఎలాంటి ప్ర‌భావం ప‌డ‌దు.

Share
Admin

Recent Posts