ప్రస్తుతం చాలా మంది సెలబ్రిటీలు, మోడల్స్, ఔత్సాహికులు నాన్ వెజ్ డైట్‌ను వదిలి వెజ్ డైట్‌ను పాటిస్తున్నారు. వెజ్ డైట్ ఆరోగ్యకరమైందని, దాంతో బరువు తగ్గవచ్చని చెబుతూ ఆ డైట్‌నే ఫాలో అవుతున్నారు. అయితే వెజ్ డైట్‌ను మూడు రకాలుగా విభజించవచ్చు. ఒకటి పూర్తి వెజిటేరియన్ డైట్. రెండోది లాక్టో వెజిటేరియన్ డైట్. మూడోది లాక్టో-ఓవో వెజిటేరియన్ డైట్.
ప్యూర్ వెజిటేరియన్ డైట్‌లో పండ్లు, నట్స్, కూరగాయలు, తృణ ధాన్యాలు, పప్పు దినుసులను తింటారు. అదే లాక్టో వెజిటేరియన్ డైట్‌ళో అయితే పాలు, పాల ఉత్పత్తులు కూడా ఉంటాయి. ఇక లాక్టో-ఓవో వెజిటేరియన్ డైట్‌లో కోడిగుడ్లు కూడా ఉంటాయి. ఇలా వెజిటేరియన్ డైట్ మూడు రకాలుగా ఉంటుంది.
అదే నాన్ వెజిటేరియన్ డైట్ విషయానికి వస్తే చికెన్, మటన్, కోడిగుడ్లు, చేపలు ఉంటాయి. అయితే వెజ్ డైట్ లేదా నాన్‌వెజ్ డైట్ రెండింటిలో ఏది మంచిది ? ఎందుకు మంచిది ? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
న్యూట్రిషనిస్టులు, పరిశోధకులు చెబుతున్న ప్రకారం.. వెజిటేరియన్ డైట్ వల్లే ఎక్కువ లాభాలు కలుగుతాయి. ఎందుకంటే.. శాకాహారం తినడం వల్ల గుండె జబ్బులు, హైబీపీ, టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్, ఇతర తీవ్ర వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే అధిక బరువు తగ్గుతారు.
వెజిటేరియన్ డైట్‌లో అధిక మోతాదులో ఫైబర్ ఉంటుంది. అలాగే ఫైటో న్యూట్రియెంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, హైబీపీ, డయాబెటిస్, మలబద్దకం, పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా చూస్తాయి. ఇక నాన్ వెజ్ డైట్‌లో శాచురేటెడ్ ఫ్యాట్స్, ఉప్పు వంటి పదార్థాలు ఉంటాయి. అందువల్ల ఆ డైట్‌ను ఎక్కువగా పాటిస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇది పరిశోధకులు చెబుతున్న మాట.
కనుక వెజ్, నాన్ వెజ్.. రెండు డైట్‌లలో వెజ్ డైట్ మంచిదని చెప్పవచ్చు. అయితే వెజ్ డైట్‌లో పాలు, కోడిగుడ్లను తీసుకోవచ్చు. దీంతో బరువు తగ్గేందుకు సహాయ పడతాయి. కానీ వాటిని ఎక్కువగా తీసుకోరాదు. రోజూ పరిమిత మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో వెజ్ డైట్ ద్వారా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.