చిట్కాలు

Diabetes : షుగ‌ర్ ను శాశ్వ‌తంగా త‌గ్గించే ఔష‌ధం ఇది.. ఎలా త‌యారు చేయాలంటే..?

Diabetes : నేడు ప్రపంచ వ్యాప్తంగా పట్టి పీడిస్తున్న మహమ్మారి రోగం డయాబెటిస్. వయసుతో సంబంధం లేకుండా చిన్న, పెద్ద ప్రతి ఒక్కరు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. మారుతున్న జీవనశైలి, పోషకాహార లోపం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల మూడు పదుల వయసు దాట‌క ముందే డయాబెటిస్ రోగులుగా మారుతున్నారు. డయాబెటిస్ ని కంట్రోల్ లో ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు మనకు బాగా ఉపయోగపడుతాయి.

మీ అందరికీ కాకరకాయ బాగా తెలిసి ఉంటుంది. కాకరకాయ తినడం అంటే చాలా మందికి ఇష్టముందడదు. మరికొందరైతే దీని పేరు చెప్పగానే కాకరకాయ.. అని చిరాగ్గా మొహం పెడతారు. అయితే చాలా మందికి కాకరకాయలో ఉండే మంచి గుణాల గురించి తెలియక దగ్గరకు కూడా రానివ్వరు. ఇది తినడానికి చేదు ఉన్నప్పడికీ ఇందులో చాలా రకాల ఔషధ గుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇందులో ఉండే గుణాలు హానికరమైన వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

this remedy can reduce diabetes perfectly know why

కాకరకాయలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, బీటా కెరోటిన్ సమృద్ధిగా లభిస్తాయి. అలాగే ఐరన్, జింక్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం కూడా పుష్కలంగా లభిస్తాయి. ఆస్తమా, జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యల నుండి డయాబెటిస్ వరకు ఎన్నో సమస్యలు కాకరకాయ జ్యూస్ తాగడం వలన తొలగిపోతాయి.

కాకరను జ్యూస్‌లా చేసి తాగితే శరీరానికి కావాల్సి అన్ని రకాల పోషకాలు అందుతాయి. శరీంలో కేలరీల పరిమాణాన్ని పెంచుతాయి. కాకరకాయ జ్యూస్ ను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలోఉంటుంది. గర్భ ధారణ సమయంలో వచ్చే సమస్యలు, అనేక చర్మ సమస్యలు, మలబద్ధకం, జీర్ణ సంబంధ సమస్యలు తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. అధిక బరువును నియంత్రించడంలో కూడా కాకరకాయ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది.

డయాబెటిస్ ను నియంత్రించే కాకరకాయ జ్యూస్ ను ఏవిధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. దీని కోసం మొదట తొక్కతో ఉన్న ఒక కాకరకాయను, ముక్కలు చేసిన ఉసిరికాయ 2, చిన్న అల్లం ముక్క, ఒక గ్లాసు నీళ్లు, సగం నిమ్మకాయ రసం, సాల్ట్ అన్నీ వేసి బ్లెండ్ చేయండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. ఇలా వచ్చిన కాకరకాయ జ్యూస్ ని ఉదయం పరగడుపున తాగడం వల్ల డయాబెటిస్ నియంత్రణలోకి వస్తుంద‌ని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.

Share
Admin

Recent Posts