ప్ర‌శ్న - స‌మాధానం

పండ్ల‌ను ఏ స‌మ‌యంలో తింటే మంచిది..?

చాలామంది రాత్రిపూట భోజనం చేశాక పండ్లు తీసుకోవడానికి ప్రాధాన్యమిస్తారు. నిజానికి పండ్లని ఉదయం పూట అల్పాహారంతోపాటు తీసుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. పండ్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. యాపిల్‌, అరటి, నారింజ, పుచ్చకాయ వంటి వాటిలో గ్త్లెసీమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువ. వీటిలో మేలు చేసే కార్బోహైడ్రేట్లు ఉంటాయి. జీవక్రియ మెరుగుపడుతుంది. ప్లేటు నిండా ఈ పండ్ల ముక్కలు తినేసి వెళితే రోజంతా ఉత్సాహంగా ఉంటుంది.

పండ్లను ఉదయం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడటమే కాదు.. శుభ్రంగానూ ఉంటుంది. పండ్లు వ్యర్థాలనూ బయటకు పంపుతాయి. ఎలాంటి ఆహారం తీసుకున్నా ఇట్టే జీర్ణమవుతుంది. మలబద్ధకం కూడా బాధించదు. అలానే పండ్లలో లభించే పోషకాల్లో ఎంజైములు అధికంగా ఉంటాయి. ఇవి అరుగుదల మీద ప్రభావం చూపుతాయి. పండ్లను తీసుకోవడం వల్ల మానసికంగానూ సానుకూల ప్రభావం కలుగుతుంది. ఒత్తిడి దూరమవుతుంది. పండ్ల వల్ల శరీరంలోకి సహజ గ్లూకోజు అంది మొదడు ఉత్తేజితమవుతుంది. చదువుకొనే పిల్లలకు అల్పాహారంతో పాటు ఈ ముక్కలు తినిపిస్తే మంచిది. చదువుపై శ్రద్ధ పెడతారు.

what is the best time to eat fruits must know

పండ్లలో లభించే విటమిన్‌ సి శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుతుంది. రకరకాల ఇన్‌ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది. పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి నీటి శాతం ఎక్కువగానే అందుతుంది. డీహైడ్రేషన్‌ బాధించదు. దీనివల్ల చర్మం కూడా మృదువుగా మారుతుంది. బరువు తగ్గాలనుకునే వారు కాలానికనుగుణంగా దొరికే పండ్లను తీసుకోవడానికి ప్రాధాన్యమివ్వాలి. వ్యాయామాల అనంతరం, అల్పాహారం తీసుకున్నాక తినాలి. పొట్టనిండుతుంది. కెలొరీలు కూడా చేరవు.

Admin

Recent Posts