అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఈ బ్ల‌డ్ గ్రూప్ ఉన్న వారికి స్ట్రోక్ వచ్చే ప్ర‌మాదం ఎక్కువ‌..!

ఇటీవ‌లి కాలంలో యువ‌త‌తో పాటు కాస్త వ‌య‌స్సు పైబ‌డ్డ వారు కూడా గుండె జ‌బ్బున ప‌డుతుండ‌డం మనం చూస్తున్నాం. గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే గుండె జబ్బుల బారిన పడుతున్న వారి బ్లడ్ శాంపిళ్లను సేకరించి.. ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎక్కువగా స్ట్రోక్‌కు గురవుతున్నారు..? అనే దానిపై జరిపిన పరిశోధనలో పలు విషయాలు వెల్లడయ్యాయి. 60 ఏళ్లలోపు వారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని బ్లడ్ గ్రూప్ ద్వారా ఎలా అంచనా వేయవచ్చో.. పరిశోధకులు కనుగొన్నారు. 60 ఏళ్లలోపు వారిలో బ్లడ్ గ్రూప్ ‘O’ రక్తం ఉన్నవారితో పోలిస్తే ‘A’ గ్రూప్ రక్తం ఉన్నవారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నారు.

ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి ప్రారంభ స్ట్రోక్ వచ్చే అవకాశం తక్కువ. బ్లడ్ గ్రూప్ ఓ ఇస్కీమిక్ స్ట్రోక్ నుంచి రక్షిస్తుందని పరిశోధన సూచిస్తుంది. ముఖ్యంగా పెద్దవారికి స్ట్రోక్ వచ్చే రిస్క్ తక్కువగా ఉంది. స్ట్రోక్ లో రక్తం పాత్ర పోషిస్తున్నప్పటికీ, అధిక రక్తపోటు, స్మోకింగ్ వంటి ఇతర ప్రమాద కారకాలు కూడా స్ట్రోక్ ప్రమాదాన్ని బాగా పెంచుతాయని పరిశోధకులు చెబుతున్నారు.స్ట్రోక్ అనేది వైద్యపరమైన అత్యవసర పరిస్థితి.. ఇది రక్త సరఫరాకు అంతరాయం కలిగించిన తర్వాత మెదడుకు నష్టం కలిగిస్తుంది. ఇది సంభవించినప్పుడు తక్షణ చికిత్స అత్యవసరం.. కీలకం కూడా. ముందస్తు చర్యలు తీసుకుంటే మెదడు దెబ్బతినడం, ఇతర సమస్యలను కొంతవరకు తగ్గించవచ్చు.

if you have this blood group then you will get stroke

ఎ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి కచ్చితంగా స్ట్రోక్ వస్తుందని ఖచ్చితంగా చెప్పలేమని, అయితే ఇతరులతో పోలిస్తే 60 ఏళ్ల తర్వాత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని అధ్యయన నిపుణులు చెబుతున్నారు. మరోవైపు, ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం తక్కువ. పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలు తినండి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల శారీరక శ్రమ చేయండి. ధూమపానం మరియు మద్యపానం తగ్గించండి. అధిక రక్తపోటు మరియు చక్కెరను నియంత్రించండి.దీని వ‌ల‌న స్ట్రోక్‌ని నియంత్రించే అవకాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
Sam

Recent Posts