హెల్త్ టిప్స్

Coconut Oil : కొబ్బ‌రినూనెతో ఇన్ని లాభాలు ఉన్నాయా.. చెబితే న‌మ్మ‌లేరు..!

Coconut Oil : కొబ్బరి నూనె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని పెద్దలు చెప్పడం మీరు వినే ఉంటారు. కొబ్బరి నూనెతో ఆరోగ్యమే కాదు. అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. కొబ్బరి నూనెలో ఇన్ని లాభాలు ఉన్నాయని తెలుసుకుంటే కచ్చితంగా మీరు షాక్ అవుతారు. కొబ్బరి నూనె వలన తలనొప్పి, వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు, దంతాల సమస్యలు ఇటువంటివి ఏమీ కూడా కలగవు. అందుకే పూర్వీకులు కొబ్బరి నూనెని ఎక్కువగా ఉపయోగించేవారు.

చిన్నతనంలో ఒక బాలుడు దృష్టి తగ్గింది. దీంతో వాళ్ళ అమ్మగారు అరికాళ్ళకి కొబ్బరి నూనెని రాసేవారు. ఇలా క్రమంగా ఆ బాలుడి దృష్టి పెరిగింది. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మందికి కొబ్బరి నూనె చాలా చక్కగా పని చేసింది. ఓ రోజు కేరళకి ఒక ఆయన వెళ్లారు. అయితే నిద్ర పట్టలేదు. బయట నడుస్తూ ఉంటుంటే బయట ఉన్న ఒక వ్యక్తి ఏమైంది అంటే.. నిద్ర రావడం లేదని ఆ మనిషి జవాబు చెప్పాడు. కొబ్బరి నూనె తెచ్చి పాదాలకి, అరికాళ్ళకి మసాజ్ చేయగా.. వెంటనే నిద్ర పట్టింది. మంచి నిద్రని పొందడానికి కూడా కొబ్బరినూనె బాగా ఉపయోగపడుతుంది.

Coconut Oil many wonderful uses

కొబ్బరి నూనెని అరికాళ్ళకి మసాజ్ చేయడం వలన ఉదర సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. కొబ్బరి నూనెని అరికాళ్ళకి మసాజ్ చేయడం వలన పిల్లలైనా, పెద్దలైనా ఆరోగ్యంగా ఉండొచ్చు. వాపులు వంటివి కూడా పోతాయి. కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం వలన కాళ్ళ వాపులు రెండు రోజుల్లోనే మాయమైపోతాయి.

మంచి నిద్ర పట్టడానికి నిద్ర మాత్రల కంటే చక్కగా కొబ్బరి నూనె పని చేస్తుంది. తలనొప్పి వంటి సమస్యల్ని కూడా కొబ్బరి నూనెతో తరిమికొట్టేయొచ్చు. అరికాళ్ళకి కొబ్బరి నూనెని మసాజ్ చేస్తే థైరాయిడ్ సమస్య నుండి బయటపడడానికి అవుతుంది. కొబ్బరి నూనెతో మలబద్ధకం సమస్య కూడా పోతుంది. గురక సమస్య నుండి కూడా బయటపడొచ్చు. ఇలా ఎన్నో సమస్యలని కొబ్బరి నూనె తరిమికొట్టేస్తుంది.

Share
Admin

Recent Posts