నరదిష్టి తొలగిపోవాలంటే ఈ అద్భుతమైన చిట్కా పాటిస్తే చాలు..!

నరదిష్టికి నల్ల రాయి అయినా పగులుతుంది అనే సామెత వాడుకలో ఉంది. అంటే నరదిష్టి ఎంతటి ప్రభావవంతమైనదో తెలుస్తుంది. సాధారణంగా మనకు మన కుటుంబంలో అభివృద్ధి ఉంటే ఇతరుల చెడు ప్రభావం మన ఇంటిపై పడటం సర్వసాధారణం. ఈ క్రమంలోనే చెడు దృష్టి మన ఇంటిపై పడటం వల్ల ఎన్నో ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే చాలామంది నర దిష్టి తగలకుండా ఏవేవో చేస్తుంటారు.

follow this remedy to get rid of nara disti in your home

మన ఇళ్లలో పూర్వకాలం ఎవరైనా బయటకు వెళితే బయట నుంచి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు వారికి దిష్టి తీసి లోపలికి పంపించేవారు. అయితే నరదిష్టి తగలటం వల్ల మన ఇంట్లో అధికంగా నెగిటివ్ ఎనర్జీ ఏర్పడి ఇంట్లో ఎన్నో సమస్యలు, ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ క్రమంలోనే నరదిష్టిని తొలగించడానికి ఈ అద్భుతమైన చిట్కాను పాటించాలి. దీన్ని పాటిస్తే మన ఇంట్లో అంతా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది.

మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్న సమయంలో బంధువులు మన ఇంటికి వస్తారు. ఇలాంటి సమయంలోనే కొందరి చెడు దృష్టి మనపై పడుతుంది. అలాగే మనం బాగా వృద్ధిలోకి వస్తున్నప్పుడు ఆ విషయం తెలిసిన ఎవరైనా సరే ఈర్ష్య, అసూయలకు గురవుతారు. ఈ రెండు సందర్భాల్లోనూ దిష్టి బాగా ఉంటుంది.

ఇక మనం బయట హంగూ ఆర్భాటాలతో తిరిగినప్పుడు లేదా ఇతర సమయాల్లోనూ దిష్టి ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కనుక దిష్టిని తగ్గించుకోవాలి. మనం అంతా బాగానే ఉండగానే.. ఉన్నట్టుండి సమస్యలు మొదలవుతుంటే.. దిష్టి ఉందని అర్థం. కనుక దిష్టిని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. అందుకు కింద తెలిపిన చిట్కాను పాటించాలి.

అలా చెడు ప్రభావం మన ఇంటిపై పడకుండా ఉండాలంటే.. ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు (గల్లుప్పు లేదా సముద్రపు ఉప్పు) తీసుకొని అందులో పదకొండు నల్ల మిరియాలను కనిపించకుండా లోపల పెట్టి ఆ ఉప్పు గిన్నె ఎవరికీ కనిపించకుండా ఒక మూల పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల మన ఇంట్లో ఉన్న చెడు ప్రభావం తగ్గుతుంది. నెగెటివ్‌ ఎనర్జీ పోయి పాజిటివ్‌ ఎనర్జీ ఏర్పడుతుంది. నర దిష్టి తగ్గుతుంది. అన్ని సమస్యలు తగ్గుతాయి. ఇంట్లో అందరికీ అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యంగా ఉంటారు. సంపద వృద్ధి చెందుతుంది.

Sailaja N

Recent Posts