sports

సంజు శాంస‌న్ పెళ్లి గురించి తెలుసా..? ఆయ‌న ప్రేమ విష‌యం తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక లవ్ స్టోరీ అనేది ఉంటుంది. కొన్ని ప్రేమలు జీవితంలో విజయం సాధిస్తే మరికొన్ని వివిధ కారణాల వల్ల విఫలమవుతూ ఉంటాయి. అయితే ఇండియన్ క్రికెటర్ సంజూ శాంసన్ తన లవ్ గురించి గ‌తంలో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను చెప్పాడు. తను ప్రేమలో పడ్డ సమయంలో జరిగినటువంటి విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తన భార్య చారులత ఏ విధంగా పరిచయమైంది అనే విషయాలను బయట పెట్టేశారు శంసన్ మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.. సంజు సాంసన్ టీం ఇండియాలో ప్రతిభ కలిగిన ఆటగాల్లలో ఒకరు. దేశవాలి మ్యాచుల్లో రాణిస్తున్నప్పటికీ సెలెక్టర్లు మాత్రం ఇతని గుర్తించడం లేదు. టి20 వరల్డ్ కప్ కు ముందు కేరళలో టీమ్ ఇండియా మ్యాచ్ ఆడటానికి వెళ్తే..

ఆ టైంలో సాంసన్ అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. అద్భుతమైన ఆటగాడు అయినా అతనికి అవకాశం ఎందుకు ఇవ్వట్లేదని సాంసన్ అభిమానులు కటౌట్ కట్టిమరి సెలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లారు. కట్ చేస్తే గ‌తంలో ఆయన బ‌ర్త్ డే సందర్భంగా తన లవ్ మ్యారేజ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు.. సంజు సాంసన్ మరియు చారులత కేరళలోని తిరువనంతపురం మార్ ఇవానియోస్ కాలేజీలో కలిసి చదువుకున్నారు.

do you know about sanju samson love and marriage

అప్పట్లో ఇద్దరికి పెద్దగా పరిచయం ఉండేది కాదు. కానీ ఒకసారి చారులతకు శాంసన్ ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు. ఆమె కూడా యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత మెల్లిగా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఇది కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా వీరి ప్రేమ వ్యవహారం ఐదు సంవత్సరాలు కొనసాగిందట. ఆ తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి 2018 డిసెంబర్ 22న పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు.వీరి మతాలు వేరైనప్పటికీ వివాహం ద్వారా ఎలాంటి విభేదాలు లేకుండా ఒక్కటైపోయామని సంజూ శాంసన్ తెలియజేశారు. ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ తో మొదలైన ప్రేమ ఐదు సంవత్సరాల తర్వాత పెళ్లి బంధంతో ఒక్కటయ్యాయమని సాంసన్ గుర్తు చేసుకున్నారు.

Admin

Recent Posts