technology

ముకేష్ అంబానీకి స‌వాల్ విసురుతున్న బీఎస్ఎన్ఎల్.. కొత్త ప్లాన్ తో వ‌ణుకే..!

నెట్‌వ‌ర్క్ టెలికాం రంగంలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌ నెట్వర్క్స్ త‌మ‌కి ఎదురే లేద‌న్న‌ట్టు దూసుకుపోతున్నాయి. రోజురోజుకి క‌స్ట‌మ‌ర్స్ పెరుగుతున్న క్ర‌మంలో రీఛార్జ్ ప్లాన్స్ కూడా పెంచేస్తున్నారు.ఇదే స‌మ‌యంలో గవర్నమెంట్ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ వాటికి స‌వాల్ విసురుతుంది. ఇప్పటికే ప్రజలకు అందుబాటు ధరలో చవక రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తుంది బీఎస్ఎన్ఎల్‌. దాంతో చాలా మంది ఈ నెట్ వర్క్ కి మారారు. త‌క్కువ ధరలో వినియోగదారులకు గొప్ప ప్రయోజనాలను అందించడానికి బీఎస్ఎన్ఎల్ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తుంది. తాజాగా రూ.1,515 మరియు రూ.1,499 ప్లాన్‌లు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది.

రూ. 1,515 ప్లాన్ చూస్తే దీని వాలిడిటీ 365 రోజులు. అంటే నెల‌కి రూ.126 మాత్ర‌మే.అంటే వినియోగదారులకు రోజుకు 2GB డేటాను అందిస్తుంది, మొత్తం 720GB. అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 ఉచిత SMSలను కూడా కలిగి ఉంటుంది. ఒకవేళ వినియోగదారుడు రోజువారీ హై-స్పీడ్ డేటా పరిమితిని దాటితే, అంతరాయం లేని కనెక్టివిటీని నిర్ధారిస్తూ 40Kbps వేగంతో ఇంటర్నెట్‌ని బ్రౌజ్ చేయవచ్చు. 1,499 ప్రీపెయిడ్ ప్లాన్ చూస్తే ఈ ప్లాన్ ప్ర‌కారం 336 రోజులు లేదా 11 నెలల చెల్లుబాటుతో, ఈ సరసమైన ప్లాన్ ల‌భిస్తుంది. ఇది 24GB డేటాను అందిస్తుంది. ఇది అపరిమిత వాయిస్ కాల్స్ మరియు రోజుకు 100 ఉచిత SMSలను కూడా కలిగి ఉంటుంది. హై-స్పీడ్ డేటా పరిమితి అయిపోయినట్లయితే, వినియోగదారు 40Kbps వేగంతో బ్రౌజ్ చేయవచ్చు. దీనికి OTT సబ్‌స్క్రిప్షన్ కూడా లేదు.

bsnl giving cheap plans to compete with jio bsnl giving cheap plans to compete with jio

మీరు మీ జేబును ఖాళీ చేసుకోకుండా త‌క్కువ ఖ‌ర్చులో మంచి నెట్‌వ‌ర్క్‌ని పొందాలంటే బీఎస్ఎన్ఎల్‌కి వెళ్లిపోవ‌చ్చు. ఇక ఇటీవ‌ల ప్రపంచవ్యాప్తంగా సాటిలైట్ కమ్యూనికేషన్ సేవలందిస్తున్న వియసత్‌తో కలిసి ఓ కొత్త టెక్నాలజీని బీఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తీసుకొస్తుంది. ‘డైరెక్ట్ టు డివైజ్’ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురాగా, మొబైల్ టవర్లతో పనిలేకుండానే ఫోన్ కాల్స్ వచ్చే విధంగా స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర స్మార్ట్ డివైజ్‌లు శాటిలైట్ కమ్యూనికేషన్‌పై బీఎస్ఎన్ఎల్ చేసిన ట్రయల్స్ చేయ‌గా, అది విజయవంతమైంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లు ఇద్దరికీ ఇది అందుబాటులోకి రానుంది. గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర సేవలను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతోనే ఈ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Sam

Recent Posts