Ashoka Tree : మన చుట్టూ ఉండే అనేక రకాల వృక్షాల్లో అశోక చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టు గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ చెట్టు శాస్త్రీయ నామం సరాక ఇండికా. ఈ చెట్టును ఇంగ్లీష్ లో, హిందీలో కూడా అశోక అనే పిలుస్తారు. అశోక చెట్టు పెద్దగా ఉండడంతో పాటు దీని పూలు నారింజ రంగులో చూడడానికి చాలా అందంగా ఉంటాయి. హిందువులు ఈ చెట్టుకు పూజలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని దీనిని వాడడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన అనేక రకాల సమస్యలను తగ్గించడంలో అశోక చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
రక్తస్రావాన్ని ఆపటం, రక్తహీనతను తగ్గించడం, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలను తగ్గించడం ఇలా అనేక రకాల సమస్యలను తగ్గించడంలో అశోక చెట్టు మనకు దోహదపడుతుంది. నెలసరి సమయంలో అధిక రక్తస్రావం సమస్యతో చాలా మంది స్త్రీలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్యను తగ్గిచండంలో అశోక చెట్టు బెరడు మనకు సహాయపడుతుంది. 10 గ్రాముల అశోక చెట్టు బెరడును కచ్చా పచ్చాగా దంచి 4 గ్లాసుల నీటిలో వేసి మరిగించాలి. దీనిని ఒక గ్లాస్ కషాయం అయ్యే వరకు మరిగించి వడకట్టాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని రోజుకు రెండు పూటలా అర గ్లాస్ మోతాదులో గోరు వెచ్చగా తీసుకోవాలి. గర్భాశయాన్ని శాంత పరిచే గుణం అశోక చెట్టుకు ఉంది.
గర్భాశయ గోడలను ధృడంగా చయడంలో, అండకోశాలను ఆరోగ్యంగా ఉంచే గుణం కూడా ఈ అశోక చెట్టుకు ఉంది. సంతానలేమి సమస్యలతో బాధపడే స్త్రీలకు అశోక చెట్టు అద్భుతుంగా పని చేస్తుంది. అలాగే స్త్రీలల్లో తలెత్తే తెల్లబట్ట, ఫైబ్రాయిడ్స్ వంటి సమస్యలను తగ్గించడంలో కూడా అశోక చెట్టు ఉపయోగపడుతుంది. అశోక చెట్టు బెరడును 90 గ్రాములు, 30 మిల్లీ లీటర్ల పాలు, 360 మిల్లీ లీటర్ల నీటిని ఒక గిన్నెలో తీసుకుని 90 మిల్లీ లీటర్లు అయ్యే వరకు మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని పూటకు 45 మిల్లీ లీటర్ల మోతాదులో రెండు పూటలా రోజూ తీసుకోవడం వల్ల నెలసరి సమస్యలన్నీ తగ్గు ముఖం పడతాయి. ఈ కషాయాన్ని ఎప్పటికప్పుడు తాజాగా తయారు చేసుకుని తాగడం మంచిది.
అలాగే ఈ కషాయాన్ని రోజుకు రెండు పూటలా తీసుకోవడం వల్ల మొలల సమస్య కూడా తగ్గుతుంది. అదే విధంగా రక్తవిరోచనాలను తగ్గించడంలో అశోక చెట్టు పూలు మనకు సహాయపడతాయి. అశోక చెట్టు పూలను నీటిలో వేసి కషాయంలా చేసుకోవాలి. తరువాత ఈ కషాయాన్ని వడకట్టి గోరు వెచ్చగా తీసుకోవడం వల్ల రక్తవిరోచనాలు తగ్గుతాయి. అశోక చెట్టు బెరడును నీటితో అరగదీసి తేలు కుట్టిన చోట లేపనంగా రాయాలి. ఇలా చేయడం వల్ల తేలు కాటు ప్రభావం తగ్గుతుంది. ఇలా చేసిన తరువాత వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. ఈ విధంగా అనేక రకాలుగా అశోక చెట్టు మనకు ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.