వృక్షాలు

అద్భుత ఔషధ గుణాల విజయసారం.. అనేక అనారోగ్యాలను తగ్గించుకోవచ్చు..!

ఆయుర్వేద మందుల తయారీలో అనేక వృక్షాలకు చెందిన భాగాలను వాడుతుంటారు. ఈ క్రమంలోనే కొన్ని రకాల వృక్షాలకు ఆయుర్వేదంలో ఎంతగానో ప్రాముఖ్యతను కల్పించారు. అలాంటి వృక్షాల్లో విజయసారం వృక్షం ఒకటి. ఈ వృక్షాలు సుమారుగా 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఈ చెట్టు కాండం, ఆకులు, బెరడు, జిగురు, పువ్వులు అన్నీ ఉపయోగకరమే. వాటితో అనేక రకాల అనారోగ్య పమస్యలను నయం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే విజయసారం చెట్టుతో ఏయే ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..

health benefits of vijaysar

1. డయాబెటిస్‌ను తగ్గించండంలో విజయసారం చెట్టు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ చెట్టుకు చెందిన బెరడు పొడి లేదా ఆకుల రసంను రోజూ రెండు పూటలా భోజనానికి 30 నిమిషాల ముందు తీసుకోవాలి. దీంతో షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి. డయాబెటిస్‌ అదుపులో ఉంటుంది. ఇన్సులిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. క్లోమగ్రంథిలోని బీటా కణాలు ఉత్తేజం అవుతాయి. డయాబెటిస్‌ నుంచి బయట పడవచ్చు.

2. ప్రస్తుతం చాలా మంది జీవనవిధానం అస్తవ్యస్తంగా మారింది. కూర్చుని పనిచేసే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో జీవనశైలి వ్యాధులు వస్తున్నాయి. జంక్‌ ఫుడ్‌, తీపి పదార్థాల పట్ల ఆసక్తి ఎక్కువగా పెరుగుతోంది. దీంతో బరువు పెరుగుతున్నారు. అయితే విజయసారం చెట్టు ఆకులను నమలడం వల్ల తీపి, జంక్‌ ఫుడ్‌ తినాలనే యావ తగ్గుతుంది. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.

3. అధిక బరువును తగ్గించడంలో విజయసారం అద్భుతంగా పనిచేస్తుంది. దీని వల్ల శరీరంలోని ఆమ దోషాలు తగ్గుతాయి. వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. అతిగా తినే వ్యాధి తగ్గుతుందిత. కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి. విజయసారం పొడి లేదా ఆకులను రోజూ తీసుకోవడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు.

4. విజయసారం ఆకులు, పొడిలో యాంటీ ఫ్లాట్యులెంట్‌ లక్షణాలు ఉంటాయి. అందువల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. జీర్ణాశయంలో గ్యాస్‌ ఏర్పడదు. ఆకలి పెరుగుతుంది. పోషకాలను శరీరం సరిగ్గా గ్రహిస్తుంది. దీంతో జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

5. విజయసారం ఆకుల్లో యాంటీ మైక్రోబియల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ అల్సర్‌ లక్షణాలు ఉంటాయి. అందువల్ల అన్ని రకాల అల్సర్లు తగ్గుతాయి. విజయసారం ఆకులను పేస్ట్‌లా చేసి గాయాలపై రాస్తే అవి త్వరగా మానుతాయి. ఆకులను నమిలి తినడం వల్ల నోట్లో అల్సర్లు ఉండవు. జీర్ణాశయంలోని అల్సర్లు కూడా తగ్గుతాయి.

6. విజయసారం బెరడు, ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ మైక్రోబియల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. దీని వల్ల రక్తం శుద్ధి అవుతుంది. రక్తంలోని విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. చర్మ సమస్యలు తగ్గుతాయి. ఎగ్జిమా, దురద, బొబ్బలు, సోరియాసిస్‌, స్కేబిస్‌ వంటి సమస్యలు తగ్గుతాయి. విజయసారం ఆకుల రసం లేదా బెరడు పొడిని ఫేస్‌ ప్యాక్‌లా వాడవచ్చు. దీంతో చర్మంపై ముడతలు, మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది.

7. జుట్టు పెరుగుదలను విజయసారం ప్రోత్సహిస్తుంది. ఈ చెట్టు ఆకుల్లో యాంటీ మైక్రోబియల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. కనుక ఆకుల నుంచి తీసిన రసాన్ని జుట్టుకు రాస్తుండాలి. దీంతో జుట్టు కుదుళ్లు దృఢంగా మారుతాయి. ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. దురద, చుండ్రు నుంచి బయట పడవచ్చు.

8. రక్తాన్ని శుద్ధి చేయడంలో విజయసారం బెరడు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది.

9. ఆర్థరైటిస్‌ నొప్పులు ఉన్నవారు విజయసారం ఆకులను పేస్ట్‌లా చేసి నొప్పి ఉన్న ప్రదేశంపై రాస్తుండాలి. దీంతో నొప్పులు తగ్గుతాయి.

10. విజయసారం బెరడు పొడితో దంతాలను శుభ్రం చేసుకోవచ్చు. దీంతో దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది.

విజయసారం బెరడు పొడి, ట్యాబ్లెట్లు మనకు షాపుల్లో లభిస్తాయి. పొడిని రోజూ 3 నుంచి 5 గ్రాముల మోతాదులో వేడి నీటితో లేదా తేనెతో తీసుకోవచ్చు. ఆకుల రసం అయితే రోజుకు 1-2 టీస్పూన్లు చాలు. బెరడు కషాయం అయితే రోజుకు 50-100 ఎంఎల్‌ తాగవచ్చు. ట్యాబ్లెట్లు అయితే రోజుకు 1-2 వాడవచ్చు. రోజూ రాత్రి ఒక గ్లాస్‌ నీటిలో విజయసారం బెరడును వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని పరగడుపునే తాగాలి. దీంతో డయాబెటిస్‌ అదుపులోకి వస్తుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts