హెల్త్ టిప్స్

ఈ ఆహారాల విలువ తెలుసుకోండి..!

ఆఫీసుకు వెళ్లే హడావిడిలో పెద్దలకు, స్కూల్‌కు వెళ్లే హడావిడిలో పిల్లలకు తగిన పోషకాహారాలు తీసుకోలేకపోతున్నారు. రోజూ తినే ఆహారంతోపాటు ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ఆ పోషకాలు వేటిలో లభిస్తాయో, వాటి వల్ల లాభాలేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..

take these foods in breakfast

1. ఫిగ్స్‌

ఉల్లి ఆకారంలో పచ్చగా లోపల ఎర్రని గింజలతో ఉండే ఫిగ్స్‌ ఇప్పుడు అన్ని చోట్లా దొరుకుతున్నాయి. వీటినే అంజీర్‌ పండ్లని అంటారు. తాజా ఫిగ్స్‌లో పొటాషియం ఎక్కువ శాతం లభిస్తుంది. హై, లో బ్లడ్‌ ప్రెషర్‌ నుంచి కాపాడుతాయి. బరువు పెరగకుండా చూసే ఫైబర్‌ను కూడా ఈ పండ్లు కలిగి ఉంటాయి.

2. బెర్రీస్‌

గుండెకు, మెదడుకు ఎంతో శక్తినిచ్చేవి బ్లూ బెర్రీస్‌. దీంతోపాటు క్రాన్‌ బెర్రీలు, బిల్‌ బెర్రీస్‌ కూడా ఉపయోగపడతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్‌లు, విటమిన్‌ సి, ఇ అధికంగా ఉంటాయి. వీటి వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు నయం అవుతాయి.

3. తేనె

చక్కెరకు బదులుగా ఏ పదార్థంలోనైనా తేనె వాడుకోవచ్చు. సత్వర శక్తినిచ్చే సాధనంగా తేనె బాగా పనిచేస్తుంది. దీనిలోని కాల్షియం ఎముకలకు, గుండెకు కూడా బలాన్నిస్తుంది. జీర్ణక్రియ మెరుగు పడేందుకు తేనె సహాయ పడుతుంది.

4. దానిమ్మ

ఈ పండ్లలోనూ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. గ్రీన్‌ టీ లో కంటే అధికంగా పాలిఫినాల్స్‌, టానిన్స్‌, ఎన్‌థోక్సిన్స్‌ ఈ పండ్లలో ఉంటాయి. యాంటీ ఏజెంట్లుగా క్యాన్సర్‌ కణాలతో పోరాడే శక్తిని ఇవ్వడంలో ఇవి సహాయ పడతాయి.

5. ఆలివ్‌ ఆయిల్‌

ఓలిక్‌ యాసిడ్‌తో నిండి ఉండే ఆలివ్‌ ఆయిల్‌లో రక్తానికి అవసరం అయ్యే హెచ్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ లభిస్తుంది. రక్తంలోని చక్కెర శాతాన్ని కంట్రోల్‌ చేయడంలో, క్యాన్సర్‌ నుంచి కాపాడడంలో సహాయ పడుతుంది.

6. సోయా బీన్స్‌

ప్రోటీన్‌లకు మారుపేరు సోయాబీన్‌ అని వేరే చెప్పక్కర్లేదు. గుండె సంబంధ వ్యాధుల నుంచి రక్షణకు ఎంతో ఉపయుక్తం. ఫైబర్‌, పొటాషియంలు మెండుగా ఉండే సోయాబీన్స్‌ను రోజువారీ ఆహారంలో తప్పక తీసుకోవాలి.

7. పెరుగు

ప్రోటీన్లు, కాల్షియం, రైబోఫ్లేవిన్‌, విటమిన్‌ బి 12తో కూడిన పెరుగు శరీరానికి సాత్విక ఆహారంగా పనిచేస్తూ సహజ జీర్ణశక్తిని పెంచేందుకు సహకరిస్తుంది.

ఈ ఆహారాల‌ను రోజూ ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. శ‌రీరానికి పోష‌ణ‌, శ‌క్తి ల‌భిస్తాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts