Moduga Chettu : మన చుట్టూ ఉండే ఔషధ చెట్లల్లో మోదుగ చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టు మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. మోదుగ చెట్టు ఎక్కువగా రోడ్ల పక్కన, చేల దగ్గర, అడువులల్లో పెరుగుతుంది. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని వాడడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోనాలను పొందవచ్చు. దీనిని సరైన పద్దతిలో ఉపయోగించడం వల్ల అనేక రకాలు అనారోగ్య సమస్యలను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. ఔషధంగానే కాదు హోమ ద్రవ్యంగా కూడా దీనిని ఉపయోగిస్తారు. మోదుగ చెట్టును నెయ్యిలో మండించినప్పుడు వచ్చే పొగను పీల్చడం వల్ల మనం అనేక రకాల అనారోగ్్య సమస్యలు దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మోదుగ చెట్టును ఉపయోగించడం వల్ల ముఖ్యంగా ప్లీహ రోగాలు, మూల వ్యాధులు, శ్లేష్మ రోగాలు నయం అవుతాయి.
ఈ చెట్టు బెరడు కారం, చేదు, వగరు రుచులను కలిగి ఉంటుంది. మోదుగ చెట్టును ఉపయోగించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి…దీనిని ఎలా ఉపయోగించడం వల్ల మనకు మేలు కలుగుతుంది..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. నీళ్ల విరోచనాలను తగ్గించడంలో మోదుగ చెట్టు జిగురు మనకు ఎంతగానో సహాయపడుతుంది. మోదుగ చెట్టు జిగురును ఎండబెట్టి దంచి పొడిగా చేసుకోవాలి.ఈ పొడిని 10 గ్రాముల మోతాదులో తీసుకుని దానికి 10 గ్రాముల దాల్చిన చెక్క పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని మూడ పూటలా అర టీ స్పూన్ మోతాదులో తీసుకోవడం వల్ల నీళ్ల విరోచనాలు తగ్గు ముఖం పడతాయి. మోదుగ చెట్టు కాడను దంచి పేస్ట్ లాగా చేయాలి. ఈ పేస్ట్ ను మొలలపై రాసి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా మొలల హరించుకుపోతాయి. తేలు కాటుకు విరుగుడుగా కూడా దీనిని ఉపయోగిస్తారు.
మోదుగ చెట్టు గింజలను జిల్లేడు పాలతో కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని తేలు కాటుకు గురి అయిన చోట రాయాలి. ఇలా చేయడం వల్ల తేలు కాటు వల్ల కలిగే బాధ త్వరగా తగ్గుతుంది. మౌత్ వాష్ గా కూడా ఈ చెట్టు మనకు సహాయపడుతుంది. మోదుగ చెట్టు ఆకులను నీటిలో వేసి కషాయంలా చేసుకోవాలి. ఈ కషాయాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల నోరు శుభ్రపడుతుంది. నోటి సమస్యలు రాకుండా ఉంటాయి. పిల్లల్లో వచ్చే నులిపురుగుల సమస్యను తగ్గించడంలో కూడా మోదుగ చెట్టు మనకు సహాయపడుతుంది. మోదుగ చెట్టు విత్తనాలను పొడిగా చేయాలి. ఈ పొడిని తేనెతో కలిపి ఇవ్వడం వల్ల నులి పురుగుల సమస్య తగ్గుతుంది. మోదుగ చెట్టు ఆకులకు షుగర్ ను నియంత్రించే శక్తి కూడా ఉంది.
ఈ ఆకులను ఎండబెట్టి పొడిగా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని తగిన మోతాదులో రోజూ తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. ఉబ్బసం రోగాలతో బాధపడే వారు మోదుగ చెట్టును ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మోదుగ చెట్టు జిగురును దంచి పొడిలా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని పూటకు రెండు గ్రాముల మోతాదులో మంచి నీటితో కలిపి రెండు పూటలా తీసుకోవడం వల్ల ఉబ్బసం అదుపులో ఉంటుంది. ఈ విధంగా మోదుగ చెట్టులో ప్రతి భాగం మనకు ఎంతగానో సహాయపడుతుందని దీనిని వాడడం వల్ల చాలా సులభంగా అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.