Avakaya Pachadi : కొత్త ఆవకాయ పచ్చడి.. పక్కా కొలతలతో ముక్క మెత్తబ‌డకుండా ఇలా పెట్టుకోవ‌చ్చు..!

Avakaya Pachadi : ఆవ‌కాయ ప‌చ్చ‌డి.. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. వేడి వేడి అన్నంలో, నెయ్యితో క‌లిపి ఈ ప‌చ్చ‌డిని తింటే చాలా రుచిగా ఉంటుంది. వేస‌వికాలంలో ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేసుకుని సంవ‌త్స‌రం పాటు తింటూ ఉంటాం. మ‌నంద‌రికి ఎంతో ఇష్ట‌మైనా ఈ ఆవ‌కాయ ప‌చ్చ‌డిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. మొద‌టిసారి చేసే వారు ఎవ‌రైనా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, ఎక్కువ‌కాలం పాటు నిల్వ ఉండేలా ఆవ‌కాయ ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆవ‌కాయ ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మామిడికాయ‌లు – 3 కిలోలు, ఆవాలు – 300 గ్రాములు, మెంతులు – 75 గ్రాములు, వెల్లుల్లి పాయ‌లు – 4, పొట్టు తీసిన వెల్లుల్లిపాయ‌లు – 3, ఉప్పు – 400 గ్రాముల నుండి 500 గ్రాములు, కారం – 350 గ్రాములు, ప‌సుపు – ఒక టేబుల్ స్పూన్, ప‌ల్లీల నూనె – ఒక లీట‌ర్.

Avakaya Pachadi recipe in telugu make in this method
Avakaya Pachadi

ఆవ‌కాయ పచ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా ఆవాలు, మెంతులు, వెల్లుల్లి రెబ్బ‌లు, ఉప్పును ఒక గంట పాటు ఎండ‌లో ఎండ‌బెట్టుకోవాలి. త‌రువాత ఇలా ఎండ‌బెట్టుకున్న తరువాత మెంతుల‌ను జార్ లో వేసి పొడిగా చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఆవాల‌ను పొడిగా చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. అలాగే పొట్టు తీయ‌ని వెల్లుల్లి రెబ్బ‌లను కూడా జార్ లో వేసి క‌చ్చా ప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ‌ల‌ను శుభ్రంగా తుడిచి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. వీటిలో ఉండే జీడిని తీసేసి మ‌ర‌లా మ‌ర‌లా ముక్క‌ల‌ను కూడా తుడుచుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ లో ఆవ పిండి, మెంతుల పిండి, కారం, ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత మ‌రో గిన్నెలో అర కిలో నూనెను తీసుకోవాలి. త‌రువాత ఇందులో మ‌రో టేబుల్ స్పూన్ ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత ఇందులో మామిడి కాయ ముక్క‌లను కొద్ది కొద్దిగా వేసి 3 నిమిషాల పాటు నాన‌బెట్టుకుని పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి.

ఇలా అన్నింటిని తీసుకున్న త‌రువాత ఇందులో మిక్సీ ప‌ట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ తో పాటు వెల్లుల్లి రెబ్బ‌లు కూడా వేసి క‌ల‌పాలి. త‌రువాత ఉప్పు, కారం క‌లిపి పెట్టుకున్న మిశ్ర‌మం వేసి క‌ల‌పాలి. త‌రువాత ప‌సుపు వేసిన నూనెతో పాటు మిగిలిన నూనె కూడా వేసి క‌ల‌పాలి. ఇప్పుడు ఈ ప‌చ్చ‌డిపై మూత పెట్టి 3 రోజుల పాటు ఊర‌బెట్టుకోవాలి. అలాగే రోజుకు రెండు సార్లు క‌లుపుతూ ఉండాలి. ఇలా ఊర‌బెట్టుకున్న త‌రువాత ప‌చ్చ‌డిని జాడీలో లేదా గాజు సీసాలో లేదా ప్లాస్టిక్ డ‌బ్బాలో ఉంచి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆవ‌కాయ ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. ఈ ప‌చ్చ‌డి త‌యారీకి వాడే పాత్ర‌లు, గంటెలు త‌డి లేకుండా పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ప‌చ్చ‌డి పాడ‌వ‌కుండా చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది.

Share
D

Recent Posts