Red Sandalwood : మన ఆరోగ్యంతో పాటు మన అందానికి మేలు చేసే మొక్కలు కూడా చాలానే కూడా ఉంటాయి. అలాంటి ఔషధ మొక్కల్లో ఎర్ర చందనం మొక్క కూడా ఒకటి. దీనిని రక్త చందనం అని కూడా అంటారు. ఈ మొక్క శాస్త్రీయ నామం పెట్రో కార్పస్ సాంటలీనియస్ అని కూడా అంటారు. అలాగే దీనిని ఇంగ్లీష్ లో రెడ్ సాండల్ వుడ్ అని అంటారు. ఎర్ర చందనం మొక్క ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతుంది. అలాగే శేషాచలం అడవులు ఈ మొక్కకు బాగా ప్రసిద్ది. ఎర్ర చందనం అత్యంత విలువైన కలప అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎర్ర చందనం కలపను ఎగుమతి చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడో నిషేధించిది. అసలు ఎర్ర చందనం చెట్టు మనకు ఏవిధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎర్ర చందనంతో చేసే సంగీత వాయిద్యాలను జపాన్ లో ప్రతి ఇంట్లో ఉంచుకుంటారు.
ఈ ఎర్ర చందనం కలపను జపాన్, చైనా దేశాలు ఎక్కువగా దిగుమతి చేసుకుంటాయి. వీరు ఎర్ర చందనంతో బొమ్మలు, సంగీత పరికరాలు, వాస్తుకు సంబంధించిన పరికరాలను తయారు చేసుకుంటారు. అలాగే సౌందర్య సాధనాల్లో కూడా దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే ఎర్ర చందనంతో చేసిన ఎటువంటి వస్తువైన ఇంట్లో ఉంటే అంతా కలిసి వస్తుందని ఎక్కువగా నమ్ముతారు. అదే విధంగా సుగంద ద్రవ్యాల తయారీలో, కొన్ని రకాల మందుల తయారీలో, వయాగ్రా తయారీలో, ఫర్ ఫ్యూమ్స్ తయారీలో, కలర్ ఏజెంట్ గా కూడా ఎర్ర చందనం ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ ఎర్ర చందనం చెక్కతోటి నకిలీ రుద్రాక్షలు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఎర్ర చందనం కలప కోట్లు విలువ చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎర్ర చందనం మొక్క అన్నీ ప్రాంతాల్లో పెరగదు.
అలాగే ఈ మొక్కను తవ్వడం, నరకడం నిషేధం. ఈ మొక్కను నరికినా, తవ్వినా చట్ట రీత్యా నేరం అవుతుంది. ఈ మొక్కను మనం నేరుగా ఉపయోగించకూడదు. ఎర్ర చందనం మొక్క గొప్పతనం గురించి అలాగే దీని వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మాత్రమే తెలుసుకోగలం. ఎర్ర చందనం మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఎటువంటి శరీరతత్వం ఉన్నవారైనా దీనిని ఉపయోగించవచ్చు. శరీరం పై మచ్చలు, పిగ్మేంటేషన్, మొటిమలను తగ్గి చర్మాన్ని తాజాగా ఉంచడంలో ఈ మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన మందుల్లో, దగ్గు మందుల తయారీలో, రక్తాన్ని శుద్ధి చేసే మందుల తయారీలో కూడా దీనిని ఉపయోగిస్తున్నారు. ఎర్ర చందనం యాంటీ పైరటిక్, యాంటీ ఇన్ ప్లామేటరీ కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఎర్ర చందనం మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.