vastu

బెడ్‌రూమ్ మొత్తం ఎరుపుమ‌యం చేస్తే ఏమ‌వుతుందో తెలుసా..?

భార్యాభ‌ర్త‌లు ఎవ‌రైనా జీవితాంతం క‌ల‌సి ఉండాల‌ని, ఎలాంటి వివాదాలు, గొడ‌వలు జ‌ర‌గ‌కుండా, అపార్థాలు చోటు చేసుకోకుండా హాయిగా కాపురం చేయాల‌ని అనుకుంటారు. కానీ కేవ‌లం కొంద‌రు మాత్ర‌మే ఇలా గ‌డుపుతారు. ఇంకొంద‌రు ఎప్పుడూ గొడ‌వ‌ల‌తో కాల‌క్షేపం చేస్తుంటారు. చివ‌రికి అవి విడాకుల వ‌ర‌కు దారి తీస్తాయి. అయితే అలాంటి అవ‌స‌రం లేకుండా దంప‌తులు హాయిగా కాపురం చేయాలంటే అందుకు ఫెంగ్ షుయ్ వాస్తు ఉప‌యోగ‌ప‌డుతుంది. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎరుపు రంగు ఇంకు పెన్నును బెడ్‌రూంలో పెట్టుకోండి. దాంతో మీ జీవిత భాగ‌స్వామి ప‌ట్ల మీకు ఉన్న ప్రేమ గురించి రాయండి. మీకు, మీకు పార్ట్‌న‌ర్‌కు మ‌ధ్య‌లో జ‌రిగిన ప్రేమ పూరిత‌మైన ఘ‌ట‌న‌ల గురించి పుస్త‌కంలో రాసుకోండి. ఎరుపు రంగు ప్రేమ‌కు, రొమాన్స్‌కు చిహ్నం క‌నుక‌, మ‌ళ్లీ భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య ప్రేమ చిగురిస్తుంది. చెక్క‌తో చేసిన రెండు ఏనుగు బొమ్మ‌లను బెడ్‌రూంలో పెట్టుకోండి. దీంతో ఫెంగ్ షుయ్ వాస్తు ప్ర‌కారం దోషం పోతుంంది. దంప‌తుల మ‌ధ్య క‌ల‌హాలు రాకుండా ఉంటాయి. క్రిస్టల్స్‌ను బెడ్‌రూంలో వేలాడ‌దీయండి. దీంతో అవి పాజిటివ్ వైబ్రేష‌న్స్ క్రియేట్ చేస్తాయి. దంప‌తుల మ‌ధ్య ఉండే క‌ల‌హాలు పోతాయి. తిరిగి వారు హ్యాపీగా కాపురం చేస్తారు.

couples who follow these feng shui vastu tips will lead happy life

ఎరుపు రంగు ప్రేమ‌కు, రొమాన్స్‌కు చిహ్న‌మని ముందే చెప్పాం క‌దా. అయితే ఎరుపు రంగుకు చెందిన క‌ర్ట‌న్లు, దిండ్లు, ప‌రుపులు, బెడ్‌షీట్లు, ఇత‌ర వ‌స్తువులు వీలైన‌న్ని బెడ్ రూంలో పెట్టుకోండి. అయితే అవ‌న్నీ ఎరుపు రంగుకే చెందిన‌వి అయి ఉండాలి. దీంతో దంప‌తుల క‌ల‌హాలు పోతాయి. బెడ్‌రూంలో పెట్టుకునే అలంక‌ర‌ణ వ‌స్తువుల్లో జంట‌లు ఉండేట్టు చూసుకోండి. జంట ప‌క్షులు, జంట మ‌నుషులు ఇలా అన్నీ జంట‌లా ఉండేలా చూడండి. దీంతో అపార్థాలు పోయి భార్యాభ‌ర్త‌లు సుఖంగా ఉంటారు. ఆరెంజ్ వాస‌న వ‌చ్చే స్ప్రేల‌ను బెడ్‌రూంలో స్ప్రే చేసుకోవాలి. దీంతో పాజిటివ్ వైబ్రేష‌న్స్ వ‌చ్చి వాస్తు దోషం పోతుంది. దంప‌తులు బాగుంటారు.

బెడ్‌కు ఇరువైపులా చిన్న‌పాటి బెడ్ లైట్ల‌ను పెట్టుకోవాలి. వాస్తు దోషం పోయి పాజిటివ్ వైబ్రేష‌న్స్ వ‌స్తాయి. క‌ల‌హాలు ఉండ‌వు. బెడ్‌రూం ఎప్పుడూ చెత్త చెత్త‌గా ఉండ‌రాదు. ఉంటే వాస్తు దోషం వ‌స్తుంది. దంప‌తుల కాపురం స‌జావుగా ఉండ‌వు. క‌నుక బెడ్‌రూంలో ఉండే చెత్త‌, ప‌నికి రాని వ‌స్తువుల‌ను తీసేయాలి. భార్యాభ‌ర్య‌లు ఇద్ద‌రూ అప్పుడ‌ప్పుడు ఒక‌రికొక‌రు గిఫ్ట్‌లు ఇచ్చుకోవాలి. చిన్న‌వైనా సరే గిఫ్ట్‌లు ఇచ్చుకోవ‌డం వ‌ల్ల వారి మ‌ధ్య ప్రేమ‌, ఆత్మీయ‌త పెరుగుతుంది. అయితే క‌త్తి, బ్లేడు వంటి ప‌దునైన వ‌స్తువుల‌ను గిఫ్ట్‌లుగా ఇచ్చుకోరాదు. పింక్ లేదా ఎరుపు రంగులో ఉండే గులాబీల‌ను బెడ్‌రూంలో పెట్టుకోవాలి. దీంతో వాస్తు దోషం పోతుంది. దంప‌తుల మ‌ధ్య ప్రేమ చిగురిస్తుంది.

Admin

Recent Posts