వాస్తు అంటే కేవలం ఇంటి కోసమే వర్తిస్తుందని చాలా మంది భావిస్తారు. అయితే వాస్తు అనేది కేవలం ఇంటికే కాదు, ఇంట్లోని వస్తువులకు కూడా వర్తిస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంట్లో మనం ఉపయోగించే వస్తువులకు కూడా వాస్తు ఉంటుందని వారు చెబుతున్నారు. ఇక వాస్తు నియమాల విషయానికి వస్తే చాలా మంది తరచూ చపాతీలను చేస్తుంటారు. అయితే చపాతీల తయారీ కోసం వాడే పీట, కర్ర విషయంలోనూ వాస్తును పాటించాలని వారు అంటున్నారు.
సాధారణంగా చాలా మంది చపాతీ పీట, కర్ర అంటే వస్తువులే కదా అని భావిస్తారు. కానీ అలా అనుకోవద్దని, వాస్తు పరంగా వాటికి కూడా నియమాలు ఉంటాయని అంటున్నారు. చపాతీ పీట, కర్రలను ఎప్పుడు పడితే అప్పుడు కొనకూడదని వారు చెబుతున్నారు. కేవలం బుధ, గురు వారాల్లోనే వాటిని కొనుగోలు చేయాలని అంటున్నారు. అలాగే సోమ, శని వారాల్లో వీటిని కొనకూడదని అంటున్నారు. చపాతీ పీట, కర్రలో ఎత్తు పల్లాలు లేకుండా ఫ్లాట్‌గా ఉండాలని అంటున్నారు.
ఇక చపాతీ పీట, కర్రతో చపాతీలు లేదా పూరీలు చేసేటప్పుడు శబ్దం రాకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. కనుక వీటిని మీరు కొనేటప్పుడే ఒకసారి టెస్ట్ చేసి కొంటే బెటర్. ధ్వని వచ్చే పీట, కర్రలను కొనకూడదు. అలా సౌండ్ వస్తే ఆర్థిక సమస్యలు వస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇక కొందరు చపాతీ పీట, కర్రను ఉపయోగించిన తరువాత వాటిని అలాగే పెడుతుంటారు. తరువాత వాటిని మళ్లీ వాడినప్పుడు శుభ్రం చేస్తుంటారు. అలా చేయకూడదు. ఎప్పటికప్పుడు వాటిని వాడిన వెంటనే శుభ్రం చేయాలి. లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ కూడా చేరుతుంది. కనుక ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని వారు చెబుతున్నారు.