vastu

Positive Energy : ఇలా చేస్తే.. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.. మీ ఇంట్లో నుండి ప్రతికూల శక్తి అంతా పోతుంది..!

Positive Energy : ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, సంతోషంగా జీవించాలని అనుకుంటారు. మీ ఇంట్లో ప్రతికూల శక్తి లేకుండా, హాయిగా ఉండాలని మీరు కూడా అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఇలా చేయండి.. ఇలా చేశారంటే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. నెగటివ్ ఎనర్జీ మొత్తం ని మీరు తొలగించుకోవచ్చు. ప్రతి ఒక్క ఇంట్లో కూడా గడియారం ఉంటుంది. గడియారంతో మనం టైం చూసుకోవచ్చు. అయితే నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ముందు మీరు మీ ఇంట్లో పని చేసే గడియారాలు, తిరుగుతున్నాయా లేదా అనేది చూడాలి.

గడియారం పాడైపోవడం వలన ఇంట్లో ప్రతికూల శక్తి ఏర్పడుతుంది. ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండే గడియారం తిరిగేటట్టు చూసుకోవాలి. ఒకవేళ పని చేయకపోతే, దానిని రిపేర్ చేయించుకోవాలి. గడియారం ని పెట్టేటప్పుడు ఏ దిశ లో పెడుతున్నారు అనేది కూడా మీరు తప్పక చూసుకోవాలి. తూర్పు, ఉత్తర, పడమర దిక్కుల్లో గడియారం మీ ఇంట్లో ఉండేటట్టు చూసుకోండి.

follow this tip to bring positive energy into your home

ఆకుపచ్చని గడియారాలు ఇంటి లోపల పెట్టకూడదు. ఇతర రంగులతో ఉండే గడియారాలని మీరు మీ ఇంట్లో పెట్టొచ్చు. అదేవిధంగా గడియారాలని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. నెగిటివ్ ఎనర్జీ దూరమవ్వాలంటే, ఇంటి లోపల ప్లాస్టిక్ ఫర్నిచర్ లేకుండా చూసుకోండి. చెక్క ఫర్నిచర్ ఉంటే మంచిది. అలానే మెటల్ తో చేసిన వాటిని కూడా పెట్టకండి. మెటల్ ఫర్నిచర్ ఉండడం కూడా మంచిది కాదు.

తేలికపాటి ఫర్నిచర్ ని మీరు మీ ఇంట్లో ఉంచేటప్పుడు ఉత్తరం, తూర్పు వైపు మాత్రమే ఉంచుకోండి. ఇంటి ముఖద్వారం దగ్గర కచ్చితంగా ఒక తులసి మొక్కని పెట్టండి. ఇలా మీరు పాటిస్తే పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది నెగటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమవుతుంది. కచ్చితంగా ప్రతిరోజు తులసి మొక్కని పూజించాలి. తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తే చాలా మంచి జరుగుతుంది. తులసి వలన ఆరోగ్య ప్రయోజనాలను కూడా మనం పొందవచ్చు. ఎన్నో రకాల సమస్యల్ని తులసి దూరం చేస్తుంది.

Admin

Recent Posts