vastu

ఇంటి ముఖము తూర్పు లేక ఉత్తరము దిక్కుకు ఎందుకు ఉండాలి?

వాస్తుశాస్త్రము ప్రకారము ఇంటి ముఖద్వారము తూర్పు లేక ఉత్తరము దిక్కువైపు చూస్తుండాలి. ఇలా ఎందుకుండాలని మనకు ప్రశ్న ఉదయించవచ్చు. కాని అనుభవ పూర్వకంగా తెలిసినదేమిటంటే వాస్తుశాస్త్రాన్ని ఆధారంగా నిర్మించిన గృహాల వల్ల అనేక విధాలైన ప్రయోజనాలున్నాయని, అలా నిర్మించిన గృహాలు ప్రసన్నంగా మరియు ఆహ్లాదకరంగా ఉన్నాయని నిరూపితమైనది.

దక్షిణ భారదేశంలో ఈ విధానమైన గృహ నిర్మాణాలు ఎక్కువగా ఉంటాయి. వర్షాలు కురిసే విధానంగా గాలులు వీచే దిశ మరియు సూర్యకాంతి ప్రసరించే దిక్కులను ఆధారంగా చేసుకొని వాస్తు గృహనిర్మాణ విధానాన్ని తెలుపుతుంది.

why house face should be to east or north

వాతావరణ కాలుష్యం వల్ల ఓజోన్ పొర ఇంకా క్షీణించే అవకాశం ఉన్నందున అతినీలలోహిత కిరణాలు సూటిగా భూమిని తాకడం వల్ల మానవులకు హానికలుగుతుంది. అదే మన ఇల్లు ఉత్తరం వైపుకు ముఖం కలిగి ఉన్నట్లయితే ఇంట్లోకి నీలలోహిత కిరణాలు ప్రవేశించే బెడద ఉండదు. అరుగుపై కూర్చోని బంధుమిత్రులతో ముచ్చటించుకోవడానికి అనుకూలంగా కూడా ఉంటుంది.

ఒకవేళ ఇంటి ముఖం తూర్పు దిశగా ఉన్నట్లయితే అరుగుపైన కూర్చోవడం వల్ల ఉదయపు సూర్యకిరణాలు విటమిన్ శాతాన్ని పుష్కలంగా కలిగి వున్నాయి కాబట్టి, మన శరీరాలపై ప్రసరించి శుభాన్ని కలిగిస్తాయి. తూర్పు దిశగా నిర్మించిన గృహాలలోకి ఉదయిస్తున్న సూర్యకిరణాలు లోపలి గదుల వరకూ వ్యాపిస్తాయి. అలా అందరూ పొద్దెక్కె వరకు సోమరిలా నిద్రపోయే సమస్యను సైతం సూర్యకిరణాలు పారద్రోలి పెందలకడే మనల్ని నిద్రలేపుతాయి.

Admin

Recent Posts