lifestyle

ఆహారాన్ని వృథా చేసేవారు ఇది చ‌దివితే.. క‌చ్చితంగా ఆలోచ‌న‌ను మార్చుకుంటారు..

ఇది జర్మనీలో జరిగిన సంఘటన. ఒక రెస్టారెంట్‌లో కొందరు వ్యక్తులు భోజనం చేస్తున్నారు.వారు అలవాటు ప్రకారం సగం తిని సగం వదిలివేశారు. అక్కడ ఒక మహిళా కస్టమర్ ఆకలి లేనప్పుడు ఎందుకు ఆర్డర్ చేశావు అని అడిగింది. వారు ఇలా సమాధానమిచ్చారు. ఇది మా డబ్బు, మీకు అవసరమైన విషయం కాదు అని అన్నారు. మహిళ పోలీసులను పిలిచింది, పోలీసు అధికారికి ఆమె చెప్పింది, అది విని వారికి 50 యూరోల జరిమానా విధించారు.

అప్పుడు ఆ మహిళ ఇలా అన్న‌ది. డ‌బ్బు మీదే, కానీ వనరులు దేశానికి చెందినవి. దేశంలోని వనరులను వృధా చేసే హక్కు మీకు లేదు. హక్కుల గురించి ఆలోచిస్తూ బాధ్యతలు విస్మరిస్తారు కొందరు.

do not waste food eye opening incident

ఇలాంటి సిస్టమ్ ప్రపంచం మొత్తం ప్రవేశపెడితే ఆహార వృధాని అరికట్టవచ్చు. దానితో పాటు ఆకలి చావులను కూడా నివారించవచ్చు. క‌నుక ఎవ‌రూ కూడా ఎంత పెద్ద పొజిషన్‌లో ఉన్నా కూడా డ‌బ్బు ఉంద‌నే అహంకారంతో ఆహారాన్ని అస‌రం లేకున్నా ఎక్కువ‌గా ఆర్డ‌ర్ చేయ‌డం లేదా ఇంట్లో కూడా ఎక్కువ‌గా వండ‌డం చేయ‌కూడ‌దు. ఆహారాన్ని ప‌డేసే ముందు ఒక్క‌సారి ఆలోచించాలి. అది లేక ఎంత మంది అల‌మ‌టిస్తున్నారో గుర్తు చేసుకోవాలి. అప్పుడు ఆహారాన్ని ప‌డేయాల‌ని అనిపించ‌దు.. ఆ మ‌హిళ ఇలా మాట్లాడేస‌రికి వారికి నోట మాట రాలేదు.

Admin

Recent Posts