viral news

యూట్యూబ్ వీడియోల‌ను లైక్ చేశాడు.. 5 కోట్లను పోగొట్టుకున్నాడు..

ఇటీవ‌లి కాలంలో ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా ఆన్​లైన్​లోనే జరిగిపోతున్నాయి. బ్యాంకింగ్, నగదు చెల్లింపులు, ప్రయాణికుల టికెట్​ బుకింగ్​లు వంటివి అన్ని ఆన్​లైన్​లోనే చేసేస్తున్నాం. స్మార్ట్​ఫోన్‌ ద్వారా ప్రపంచాన్ని అరచేతిలోకి తీసుకొని అన్ని కార్య‌క‌లాపాల‌ని పూర్తి చేస్తున్నాం. అయితే ప్రస్తుత సాంకేతిక యుగంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. సైబర్ నేరగాళ్లు పలు రకాలుగా ప్రజలను మోసగిస్తున్నారు. బ్యాంకు అకౌంట్లలోని నగదును కొల్లగొట్టేస్తున్నారు ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే, మనకు కూడా వాటిపై ఓ మంచి అవగాహన ఉండాలి. ఇప్పుడు వాట్సాప్, యూట్యూబ్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లను ఉప‌యోగించి కూడా నేరాలు చేస్తున్నారు.

తాజాగా, యూట్యూబ్ వీడియోను లైక్ చేసిన కార‌ణంగా ఓ వ్య‌క్తి రూ. 5.6 మిలియన్ల వ‌ర‌కు పోగొట్టుకున్నాడ‌ట‌. హ్యాక‌ర్స్ మ‌నోడిని ఈజీగా బుట్ట‌లో ప‌డేసి ఉన్న‌దంతా దోచుకున్నారు. యూట్యూబ్‌లో స‌దరు వ్య‌క్తి 123, 492 ఇలా చిన్న చెల్లింపులను అందుకున్నాడు. ఈ రిటర్న్‌ల ద్వారా అత‌నికి ఆశ ఎక్కువై చివరికి టెలిగ్రామ్ సమూహంలోకి వెళ్లాడు. అక్కడ డబ్బు డిపాజిట్ చేయడానికి బదులుగా అతనికి కమీషన్లు ఇస్తానని హామీ ఇచ్చారు. మోసం గురించి తెలియక, స‌ద‌రు వ్య‌క్తి 5.67 మిలియన్ టాకా పెట్టుబడి పెట్టాడు. తదనంతరం, స్కామర్‌లు ఎలాంటి కమ్యూనికేష‌న్ లేకుండా అత‌డిని దారుణ‌మైన మోసం చేశారు.అయితే ఆన్‌లైన్ స్కామ్‌లను గుర్తించి వాటి బారిన ప‌డ‌కుండా ఉండ‌డానికి ఈ చిట్కాలు పాటించండి.

man lost 5 crores by liking youtube videos

ఏదైనా ఆన్‌లైన్ యాక్టివిటీలో పాల్గొనే ముందు మీరు కంపెనీ లేదా వ్యక్తి గురించి ఖచ్చితమైన సమాచారాన్ని తెలుసుకోవాలి. ఆన్‌లైన్ ఆఫర్‌లు మరియు డిస్కౌంట్‌ల గురించి ప‌క్కా స‌మాచారం అందుకోండి. వీడియోల‌ని లైక్ చేయ‌డం ద్వారా డ‌బ్బులు వ‌స్తాయ‌ని చెప్పే సంస్థ‌ల‌కి దూరంగా ఉండండి. తెలియని వ్యక్తులు లేదా సమూహాల నుండి వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీకు ఆఫర్ గురించి ఖచ్చితంగా తెలియకుంటే, స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల వంటి సలహాల కోసం ఇతరులను సంప్రదించండి. మీ బ్యాంకింగ్ వివరాలు, పాస్‌వర్డ్‌లు లేదా OTPలను ఆన్‌లైన్‌లో ఎవరితోనూ ఎప్పుడూ షేర్ చేయవద్దు. మీ భద్రతను నిర్ధారించడానికి డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లతో సహా వివిధ రకాల సైబర్ స్కామ్‌ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోండి.

Sam

Recent Posts