Ulimiri Chettu : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల మొక్కల్లో వరుణ మొక్క కూడా ఒకటి. ఇది వృక్షంలా కూడా పెరుగుతుంది. అయితే మొక్కగా ఉన్నప్పుడు కూడా మనం దీన్ని ఉపయోగించవచ్చు. ఈ చెట్టు 20 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. మన చుట్టూ పరిసరాల్లో అనేక రకాల మొక్కలు ఉంటాయి. వాటిని చూసి పిచ్చి మొక్కలు అనుకుంటారు. వరుణ మొక్క కూడా అలాగే ఉంటుంది. కానీ దీని గుణాలు, ఉపయోగాలు తెలిస్తే అసలు ఎవరూ విడిచిపెట్టరు. వరుణ మొక్క మనకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. దీన్నే పలు భాషల్లో భిన్న రకాల పేర్లతో పిలుస్తారు. తెలుగులో దీన్ని ఉలిమిరి చెట్టు అంటారు. సంస్కృతంలో వరుణ వృక్షం అంటారు. ఈ మొక్కకు చెందిన ఆకులు, వేళ్లు, చెట్టుకు చెందిన బెరడును మనం ఉపయోగించవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. పలు వ్యాధుల నుంచి బయట పడవచ్చు. ఈ మొక్క వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వరుణ మొక్క వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. దీని ఆకుల రసాన్ని తీసుకుంటే జీర్ణ వ్యవస్థ మొత్తం శుభ్రమవుతుంది. మలబద్దకం తగ్గుతుంది. అజీర్ణం అన్నది ఉండదు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అలాగే గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపులో మంట వంటి సమస్యల నుంచి కూడా బయట పడవచ్చు. ఇక ఈ మొక్క ఆకుల రసాన్ని తీసుకుంటే ఆకలి పెరుగుతుంది. ఆకలి లేమి ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. వరుణ పొడి మనకు మార్కెట్‌లో బయట లభిస్తుంది. దీన్ని కూడా వాడుకోవచ్చు. ఈ పొడిని కాస్త తేనెతో తీసుకుంటే ఎలాంటి జీర్ణ సమస్య అయినా సరే తగ్గిపోతుంది.
ఇక కిడ్నీ స్టోన్స్ ఉన్నవారికి కూడా ఈ మొక్క ఆకులు పనిచేస్తాయి. వీటి రసాన్ని తాగుతుంటే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి. అలాగే మూత్రాశయ సమస్యలు కూడా తగ్గుతాయి. మూత్రంలో మంట, నురుగు వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. ఇక ఈ మొక్క ఆకుల వల్ల కడుపులో ఉండే పురుగులు మొత్తం చనిపోతాయి. అలాగే గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి. అందుకు గాను ఈ మొక్క ఆకుల పేస్ట్‌ను గాయాలపై రాసి కట్టు కట్టాలి. దీంతో సమస్య తగ్గుతుంది.
ఈ మొక్కను ఉపయోగించడం వల్ల తలనొప్పి నుంచి బయట పడవచ్చు. అలాగే పొట్టలో ఉండే ట్యూమర్లు కరిగిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. రక్తంలో ఉండే వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరంలోని వేడి మొత్తం తగ్గుతుంది. ఇలా మనం ఈ మొక్కతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ మొక్కను గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ఉపయోగించరాదు. ఈ మొక్క ఉపయోగకరమే అయినప్పటికీ దీన్ని వైద్యుల సలహా మేరకు వాడుకోవడం ఉత్తమం.