Glass Bowls : మనం వంటలు చేయడానికి రకరకాల పాత్రలు ఉపయోగిస్తూ ఉంటాం. ఏ పాత్రలో వండుకుంటే ఆరోగ్యానికి మంచిది అని కూడా ఆలోచిస్తూ ఉంటాం. అన్నింటి కంటే ఉత్తమమైనది మట్టి పాత్ర. అయితే చాలా మందికి వీటి నిర్వహణ చాలా కష్టమవుతుంది. కనుక చాలా మంది మట్టి పాత్రలను ఉపయోగించరు. రకరకాల పాత్రలను మారుస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో గాజు పాత్రలో వంట చేసుకుంటే కూడా చాలా మంచిదని వాటిని కూడా వంటకు ఉపయోగిస్తున్నారు. వేడి కూడా ఏమి కానీ గాజు పాత్రలో వంటలు చేసే వారు కూడా ఈ కాలంలో ఎక్కవవుతున్నారు. గాజు పాత్రలో వంటలు చేయడం వల్ల ఆహారంలో ఏమి కలవవు అని చాలా మంది భావిస్తారు. కానీ మనం చేసే వంటల్లో ఉండే ఎసిడిక్ నేచర్ కలిగిన పదార్థాలు గాజుతో కలవడం వల్ల గాజులో ఉండే పదార్థాలు కూడా వంట్లలో కలుస్తాయి.
గాజు పాత్రలను తయారు చేసేటప్పుడు వాటిలో లెడ్, కోబాల్ట్, క్యాడ్మియం వంటి వాటిని కలుపుతారు. ఆహారాల్లో ఉండే ఎసిడిక్ నేచర్ వల్ల వంట చేసేటప్పుడు గాజులో ఉండే ఈ పదార్థాలు మనం చేసే వంటలో కలుస్తాయి. ఇలా గాజు పాత్రలో తయారు చేసుకున్న వంటను ఎక్కువగా కాలం పాటు తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. గాజు పాత్రలో చేసిన వంటను తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రమాదం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గాజు పాత్రలో వండిన వంటకాలను తీసుకోవడం వల్ల ముందుగా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఇక లెడ్, కోబాల్ట్, క్యాడ్మియం అనేవి క్యాన్సర్ ప్రేరకాలు. వీటిని ఎక్కువగా కాలం పాటు తీసుకోవడం వల్ల మనం క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువవుతాయి. అలాగే గాజు పాత్రల్లో వండిన వంటకాలను తీసుకోవడం వల్ల స్త్రీ, పురుషులిద్దరిలోనూ సంతానలేమి సమస్యలు తలెత్తుతాయి.
అలాగే ఈ పాత్రలో ఉండే క్యాడ్మియం శరీరంలో ఇన్ ప్లామేషన్ ను పెంచడానికి ఎక్కువగా కారణమవుతుంది. దీంతో మన శరీరం బలహీనంగా తయారవుతుంది. అలాగే గాజు పాత్రల్లో వండిన వంటకాలను తీసుకోవడం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి. కనుక గాజు పాత్రలో వంటలు శ్రేష్టమైనవి కావని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొందరు ఒవెన్ లో గాజు పాత్రలో ఆహారాన్ని ఉంచి వేడి చేస్తూ ఉంటారు. గాజు పాత్రల కంటే పింగాణీ పాత్రలో ఉంచి వేడి చేయడం మంచిది. గాజు పాత్రలో కంటే మందంగా ఉండే స్టీల్ పాత్రలో వండుకోవడం మంచిదని గాజు పాత్రల్లో వండకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.