Allu Arjun Net Worth : మెగా కాంపౌండ్ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు వారి అబ్బాయి అల్లు అర్జున్ తనకంటూ సొంత ఇమేజ్ తో స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, నిర్మల దంపతులకు 1983 ఏప్రిల్ 8న తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. ప్రస్తుతం 41 ఏళ్ళు నిండాయి. బన్నీని కేరళలో మల్లు అర్జున్ అని పిలుస్తారు. అల్లు అర్జున్ కి వెంకటేష్, శిరీష్ అనే ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. వెంకటేష్ గీతా ఆర్ట్స్ చూస్తారు. శిరీష్ కూడా హీరోగా చేస్తున్నాడు. తమిళనాడు సెయింట్ మేరీ పాట్రిక్ స్కూల్లో చదివిన బన్నీ, హైదరాబాద్ మాగుంట సుబ్బరామిరెడ్డి కాలేజీలో బిబిఎ పూర్తిచేసాడు. బన్నీకి 2011 మార్చి 6న స్నేహరెడ్డితో పెళ్లి జరిగింది.
అల్లు అయాన్ అనే కొడుకు, అల్లు అర్హ అనే కూతురు వున్నారు. 2003లో గంగోత్రి మూవీతో తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బన్నీ 1985లో చిరంజీవి నటించిన విజేత మూవీలో అలాగే 1986లో కమల్ నటించిన స్వాతిముత్యం మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా పనిచేసాడు. 2001లో చిరంజీవి నటించిన డాడీ సినిమాలో కూడా నటించాడు.
ఇక డిఫరెంట్ మూవీస్ చేస్తూ స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు. దేశముదురు, సన్నాఫ్ సత్యమూర్తి, రేసుగుర్రం, సరైనోడు, అల వైకుంఠ పురంలో వంటి బ్లాక్ బస్టర్స్ చేసాడు. గంగోత్రి మూవీకి 5లక్షలు రెమ్యునరేషన్ తీసుకోగా అలవైకుంఠపురంలో మూవీకి 36కోట్లు అందుకున్నాడు.
పుష్ప పాన్ ఇండియా మూవీకి 40కోట్లు ఛార్జి చేసినట్లు టాక్. హీరోల్లో చిరంజీవి హీరోయిన్స్ లో రాణీముఖర్జీ అంటే ఇష్టం. ఇటలీ ఇష్టమైన ప్రదేశం. ఒక్కో సినిమాకు 45కోట్లు వరకూ అందుకునే బన్నీకి 400కోట్ల నెట్ వర్త్ ఉంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్డునెంబర్ 45లో 15కోట్ల విలువచేసే అధునాతన సౌకర్యాలతో ఇల్లు ఉంది. 8కార్లు,అన్ని సౌకర్యాలతో ఏడున్నర కోట్ల విలువ చేసే కార్వాన్ ఉన్నాయి. మరో కొత్త ఇల్లు కొన్నట్లు టాక్ వినిపిస్తోంది.