ఏదైనా పార్క్ కు లేదా, దోమలు ఎక్కువ ఉన్న ప్రదేశంలో సాయంత్రం వేళ..కేవలం తలపైనే దోమలు తిరుగుతాయి. ఇలా తలమీద రౌండ్ గాఈ దోమలు ఎందుకు తిరుగుతాయ్ ? మనం శ్వాసించే గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ దోమలకు ఆకర్షణీయంగా ఉంటుంది. మన తలలు మిగిలిన శరీరం కంటే వేడిగా ఉండటం వలన దోమలు వాటి వైపు ఆకర్షితమవుతాయి.
చెమటలో ఉండే లాక్టిక్ యాసిడ్ దోమలకు ఆకర్షణీయంగా ఉంటుంది. దట్టమైన నల్లటిజుట్టు దోమలకు దాగడానికి మంచి ప్రదేశం. తలకు రాసుకొనే షాంపూ, సుగంధ ద్రవ్యాలు మరియు ఇతర సౌందర్య సాధనాల వంటి పరిమళాలు దోమలను ఆకర్షిస్తాయి.
మన తలలో రక్త ప్రవాహం ఎక్కువగా ఉంటుంది, దీని వల్ల దోమలకు రక్తాన్ని గుర్తించడం సులభం అవుతుంది. సాయంత్రం మరియు తెల్లవారుజాము సమయాల్లో దోమలు చాలా చురుగ్గా ఉంటాయి.