business ideas

ఫ్లెక్స్ ప్రింటింగ్ బిజినెస్‌తో.. చెయ్యగలిగితే పెట్టుబడి లేకుండానే లక్షల్లో సంపాదన

రాజ‌కీయ నాయ‌కుల మీటింగ్‌ల‌కు, స‌భ‌లు స‌మావేశాల‌కు, ఇత‌ర కార్య‌క్ర‌మాల‌కు, సెల‌బ్రిటీల‌కు స్వాగతం తెలిపేందుకు, శుభాకాంక్ష‌లు చెప్ప‌డానికి.. చాలా మంది ఫ్లెక్స్‌ల‌ను త‌యారు చేయించి ర‌హ‌దారుల మ‌ధ్య‌లో లేదా ప‌క్క‌న, యాడ్ హోర్డింగ్‌ల‌కు అమ‌రుస్తుంటారు తెలుసు క‌దా. అయితే నిజానికి కొద్దిగా శ్ర‌మించే త‌త్వం, పెట్టుబ‌డి పెట్టే సామ‌ర్థ్యం ఉండాలే గానీ ఎవ‌రైనా.. ఫ్లెక్స్‌ను త‌యారు చేసి ప్రింట్ చేసే బిజినెస్ పెట్ట‌వ‌చ్చు. దీంతో నెల నెలా రూ.ల‌క్ష‌ల్లో ఆదాయం ఉంటుంది. మ‌రి అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్లెక్స్ ప్రింటింగ్ బిజినెస్ పెట్టాలంటే.. ఇంట్లో లేదా షాపులో పెట్ట‌వ‌చ్చు. అందుకు గాను ప్ర‌త్యేక రూంను కేటాయించాల్సి ఉంటుంది. ఈ బిజినెస్ కోసం ఒక ఫ్లెక్స్ ప్రింటింగ్ మెషిన్ అవ‌స‌రం అవుతుంది. కొత్త మెషిన్ అయితే రూ.6 ల‌క్ష‌ల వ‌ర‌కు ధ‌ర ఉంటుంది. అదే సెకండ్ హ్యాండ్‌లో ఈ మెషిన్ కొంటే రూ.3 ల‌క్ష‌ల వ‌ర‌కు మెషిన్ ల‌భిస్తుంది. ఇక ఫ్లెక్స్ ప్రింటింగ్‌కు ఎంప్టీ ఫ్లెక్స్ షీట్లు, క‌ల‌ర్లు, ఒక కంప్యూట‌ర్ అవ‌స‌రం అవుతాయి. వీటికి సుమారుగా రూ.1 ల‌క్ష వ‌ర‌కు ఖ‌ర్చు ఉంటుంది. ఇక మెషిన్ ఉన్న రూంకు ఏసీ పెట్టాలి. దానికి రూ.50వేల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంది. ఈ క్ర‌మంలో మొత్తం రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ.8 ల‌క్ష‌ల వ‌ర‌కు ఈ బిజినెస్‌కు పెట్టుబ‌డి అవ‌స‌రం అవుతుంది. అయితే షాపులో ఈ బిజినెస్ పెడితే అందుకు స‌రైన చోటును ఎంపిక చేయాలి. ఇక షాపుకు అడ్వాన్స్, నెల నెలా రెంట్ చెల్లించాల్సి ఉంటుంది.

you can earn good income with flex printing business

ఫ్లెక్స్ ప్రింటింగ్ చేయాలంటే.. ముందుగా డిజైన్ చేసిన ఇమేజ్‌ను కంప్యూట‌ర్‌లో ఉంచి దాన్నుంచి ఫ్లెక్స్ ప్రింట్ చేయాలి. త‌రువాత ఫ్లెక్స్ మీద ఇంక్ ఆరేందుకు ఫ్లెక్స్‌ను తెర‌చి ఉంచి కొంత సేపు అలాగే ఉంచాలి. ఈ క్ర‌మంలో క‌స్ట‌మ‌ర్లు కోరుకున్న సైజుల్లో ఫ్లెక్సిల‌ను ప్రింట్ చేసి ఇవ్వ‌వ‌చ్చు. ఇక 1 చ‌ద‌ర‌పు అడుగు ఫ్లెక్సిని ప్రింట్ చేసేందుకు రూ.5 వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంది. దాన్ని క‌స్ట‌మ‌ర్ల‌కు రూ.15 కు విక్ర‌యించ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో 1 చ‌ద‌రపు అడుగు ఫ్లెక్సిపై రూ.10 వ‌ర‌కు లాభం వ‌స్తుంది. అదే నిత్యం సుమారుగా 1వేయి చ‌ద‌రపు అడుగుల ఫ్లెక్సిని ప్రింట్ చేస్తే రూ.10వేలు వ‌స్తాయి. అదే నెల‌కు రూ.3 ల‌క్షల వ‌ర‌కు సంపాదించ‌వ‌చ్చు.

ఇక ఈ బిజినెస్‌లో మెషిన్‌, ఇత‌ర‌త్రా సామ‌గ్రి లేకున్నా.. ఆర్డ‌ర్లు తీసుకుని వేరే చోట‌ ఫ్లెక్స్ ప్రింట్ చేయించి దాన్ని క‌స్ట‌మ‌ర్ల‌కు అందించి ఆ విధంగా కూడా లాభాలు పొంద‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో ఫ్లెక్స్ షాపు వారు మీకు 1 చ‌ద‌ర‌పు అడుగు ఫ్లెక్సికి రూ.9 వ‌ర‌కు తీసుకుంటారు. అప్పుడు క‌స్ట‌మ‌ర్ల‌కు రూ.15కు దాన్ని అమ్మితే మీకు రూ.6 లాభం వ‌స్తుంది. అదే నిత్యం 1000 చ‌ద‌ర‌పు అడుగుల ఫ్లెక్సి ప్రింటింగ్‌ ఆర్డ‌ర్లు తీసుకుని ఆ మేర బిజినెస్ చేయ‌గ‌లిగితే 1000 * 6 = రూ.6వేలు నిత్యం లాభం వ‌స్తుంది. అదే నెల‌కు రూ.1.80 ల‌క్ష‌లు ఇలా సంపాదించ‌వ‌చ్చు.

ఫ్లెక్స్ ప్రింటింగ్ బిజినెస్‌కు లోక‌ల్ అథారిటీ నుంచి ప‌ర్మిష‌న్ ఉంటే స‌రిపోతుంది. సొంత మెషిన్‌తో ప్రింట్ చేస్తే విద్యుత్ కూడా ఖ‌ర్చ‌వుతుంది. క‌నుక విద్యుత్ చార్జిల‌ను భ‌రించాలి. ఇక మ‌నుషుల్ని పెడితే వారికి జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే పొలిటిక‌ల్ కాంటాక్ట్స్‌ను ఎక్కువ‌గా పెంపొందించుకోవ‌డం, బిజినెస్‌కు ‌ప‌బ్లిసిటీ చేయ‌డం, నాణ్యంగా ఫ్లెక్స్ ప్రింట్ చేయ‌డం.. వంటి ప‌నులు చేస్తే.. ఈ బిజినెస్ చ‌క్క‌గా వృద్ధిలోకి వ‌స్తుంది. దాంతో ఎక్కువ లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

Admin

Recent Posts